Nikesha Patel: నికీషా పటేల్ చేసుకోబోయేది ఎవరినంటే..?

హీరోయిన్ నికీషా పటేల్ గుర్తుందా?.. ఫస్ట్ సినిమాతోనే తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ఈ గుజరాతీ భామ కార్డిఫ్ లోని, వేల్స్ లో పెరిగింది.. అక్కడే మోడలింగ్ కూడా చేసింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమరం పులి’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నికీషా తర్వాత తమిళ్, కన్నడ లాంగ్వేజెస్ లోనూ యాక్ట్ చేసింది.. హిందీ, మలయాళంలో నికీషాకు చాలా ఆఫర్స్ మిస్ అయ్యాయి.

కెరీర్ స్టార్టింగ్ లో నువ్వు నటనకి పనికిరావు అనే కామెంట్స్ రావడంతో, వాటిని సీరియస్ గా తీసుకుని యాక్టింగ్ లో డిప్లొమా చేసింది.. పవన్ సినిమాతో ఇంట్రడక్షన్ ఇవ్వడంతో తన పేరు అందరికీ తెలిసింది కానీ సినిమా రిజల్ట్ కారణంగా తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. తర్వాత తమిళ్ లో బిజీ అయింది. ’కొమరం పులి’ వచ్చిన మూడేళ్లకి కళ్యాణ్ రామ్ ‘ఓం 3డి’ లో కనిపించింది. చానాళ్లకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా వచ్చిన ‘అరకు రోడ్ లో’ అనే సినిమాలో నటించింది.

తర్వాత తెలుగులో దాదాపు కనుమరుగైపోయింది. రీసెంట్ గా తనక్కాబోయే భర్తను పరిచయం చేసి వార్తల్లో నిలిచింది నికీషా. ఆమె కొంతకాలంగా ఓ ఫారినర్ తో లవ్ లో ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లతో చేసిన చిట్ చాట్ లో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో అందరూ మీ ఫియాన్సీని చూపించండి అని అడగడం స్టార్ట్ చేశారు.. ఎట్టకేలకు కాబోయే భర్తను రివీల్ చేసిందామె.

తన జీవిత భాగస్వామితో కలిసి తీసుకున్న ఫస్ట్ ఫొటోను షేర్ చేస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిందీ 32 ఏళ్ల ముద్దుగుమ్మ.. ఈ పిక్ చూసిన నెటిజన్లు తిరిగి దివాళీ విషెస్ చెబుతూ.. ‘‘మీ పెయిర్ బాగుంది.. మేడ్ ఫర్ ఈచెదర్.. అబ్రోడ్ లో పెరిగితే మాత్రం అక్కడబ్బాయినే చేసుకోవాలా?.. మరి ఇక్కడ కుర్రాళ్ల పరిస్థితి ఏంటి నికీషా?’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus