సీనియర్ నటులు వీకే నరేష్ – పవిత్ర మరోసారి ఫిలిం వర్గాలతో పాటు జనాల్లోనూ హాట్ టాపిక్‌గా మారారు.. రీసెంట్గా వివాహబంధంతో ఒక్కటయ్యారనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.. నరేష్ – పవిత్రల మధ్య రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనసరంలేదు. చాలా కాలంగా వీళ్ళు సహజీవనం చేస్తున్నారు. శుక్రవారం (మార్చి 10) న తమకు వివాహం అయిపోయింది అన్నట్టు ఓ వెడ్డింగ్ వీడియో షేర్ చేశారు నరేష్..
అది నిజం పెళ్లి కాదని.. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఓ సినిమా ప్రమోషన్స్‌లో పార్ట్ అని వార్తలు వస్తున్నాయి.. దాని గురించి ఇంకా డిస్కస్ చేసుకుంటుండగానే.. హనీమూన్‌కి వెళ్లారు అనే హింట్ ఇచ్చేలా దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని పిక్స్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి..
పవిత్ర కర్ణాటకలోని మైసూర్లో పుట్టి పెరిగారు. తండ్రి మైసూర్ లోకేష్ కర్ణాటక స్టేట్, ఫిలిం యాక్టర్.. తల్లి టీచర్.. ఆది లోకేష్ అనే బ్రదర్ ఉన్నాడు. 9వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణించడంతో.. కుటుంబ పోషణ కోసం తండ్రి నట వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు పవిత్ర.. కన్నడ నాట టీవీ నటిగా కెరీర్ స్టార్ట్ చేసి, హీరోయిన్గా నటించారు.. ఇంకో విశేషం ఏంటంటే ఆమె చదువుకుంటూనే సినిమాల్లోకి వచ్చి.. డిగ్రీ కంప్లీట్ చేసి.. సివిల్స్‌కి సైతం ప్రిపేర్ అయ్యారు..
రిజల్ట్ తేడా కొట్టడంతో నటిగా కెరీర్ కొనసాగించాలని డిసైడ్ అయ్యి.. హీరోయిన్గా మంచి పేరు సంపాదించి కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు.. కన్నడలో దాదాపు 150 చిత్రాలు చేసిన పవిత్ర 2006లో ‘నాయి నేరాలు’ మూవీకి గానూ కర్ణాటక స్టేట్ అవార్డ్ అందుకున్నారు. మొదటి భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌తో విడాకులు తీసుకున్న తర్వాత కన్నడ యాక్టర్ సుచేంద్ర ప్రసాద్‌తో 11 ఏళ్ల పాటు సహజీవనం చేసి.. 20188లో అతని నుండి విడిపోయారు.. తర్వాత నరేష్‌తో ప్రేమలో పడ్డారు.. పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్ గురించి తెలిసి.. ఆమె రియల్ లైఫ్‌లో రీల్ లైఫ్ ట్విస్టులు, కష్టాలున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..