నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు అనడంలో సందేహమే లేదు. తాజాగా వీళ్ళు జంటగా ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా రూపొందింది. టీజర్, ట్రైలర్ సినిమా పై ఆసక్తిని కలిగించాయి. ట్రైలర్ చూసిన వాళ్లంతా ఇది వాళ్ళ బయోపిక్ అని ముచ్చటించుకుంటున్నారు. నరేష్, పవిత్ర కలిసి జీవిస్తుండడం.. అలాగే ఇంకో పెళ్లి చేసుకోవాలి అనుకోవడం, మధ్యలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అడ్డుపడటం వంటి వ్యవహారాలు వార్తలకెక్కడం అందరూ చూశారు.
ఒకానొక టైంలో వీళ్ళు మైసూర్ లోని హోటల్ గదిలో ఉన్నప్పుడు రమ్య మీడియాని వెంటేసుకుని వెళ్లి పెద్ద రచ్చ చేసింది. అవన్నీ ‘మళ్ళీ పెళ్లి’ ట్రైలర్ లో చూపించారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ప్రమోషన్లలో పవిత్రా లోకేష్ ఈ విషయాల పై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. “నరేశ్ గారు నేను ఒకరిని ఒకరం ఇష్టపడి కలసి బ్రతుకుతున్నాం. మేము ఎప్పుడూ వీధిలో పడాలని అనుకోలేదు. కానీ కొందరు నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు.
అయితే అలాంటి పరిస్థితి నుంచి ఎంత హుందాగా బయటకి వస్తామనేది చాలా ముఖ్యం. నేను ఎదురుకొన్న పరిస్థితిలో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి. లేదా ఎవరికీ కనిపించకుండా ఇంట్లో కూర్చోవాలి. కానీ నరేష్ గారు నాకు అండగా నిలబడి ధైర్యం చెప్పారు. ధైర్యం ఇచ్చారు. నేను గానీ నరేష్ గారు కానీ ఎప్పుడూ ఒకరికి హాని చేయాలని అనుకునే వ్యక్తులం కాదు. మా ఇష్టప్రకారం బ్రతుకుతున్నాం. మాకు కుటుంబం అంగీకారం ఉంది’’ అంటూ చెప్పుకొచ్చింది (Pavitra Lokesh) పవిత్ర.