బాలీవుడ్ డైరెక్టర్ నుండి ఎలా తప్పించుకున్నదీ చెప్పిన ‘ఊసరవెల్లి’ నటి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా ‘ఊసరవెల్లి’. తమన్నా హీరోయిన్. సినిమాలో ఆమెకు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన పాయల్ ఘోష్ గుర్తు వుందా? మంచు మనోజ్ సరసన ‘ప్రయాణం’లో హీరోయిన్‌గా కూడా యాక్ట్ చేసింది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే, సుశాంత్ గురించి బాలీవుడ్ డ్రగ్ వ్యవహారాలు ఎలా వుంటాయో కూడా వివరించింది.

“ఒకసారి నేను ఒక దైరెక్టర్‌ను కలిశా. రూమ్‌లోకి తీసుకువెళ్లి బ్లూఫిలిం చూపించాడు. హీరోయిన్లు ఎవరిని పిలిచినా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. నాకు సిచ్యువేషన్ అర్థమయ్యింది. హెల్త్ బాగోలేదని చెప్పి అక్కడి నుండి తప్పించుకున్నా” అని పాయల్ ఘోష్ చెప్పింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మిగతా డైరెక్టర్లతో అటువంటి అనుభవాలు ఎదురుకాలేదని అన్నది. ఒక క్రికెటర్‌తో డేటింగ్, బ్రేకప్ తరవాత కంప్లీట్ డిప్రెషన్‌లోకి వెళ్ళాననీ, లాంగ్ ట్రీట్మెంట్ తరవాత దాన్నుండి బయటపడ్డానని ఆమె తెలియజేసింది.

సుశాంత్ సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదని పాయల్ ఘోష్ అంటున్నది. అతడు ఆమెకు కొన్నేళ్లుగా తెలుసు అని చెప్పింది. చాలామంది సినిమా యాక్టర్లు డ్రగ్స్ తీసుకుంటారని, అలాగని వాళ్లందరో మత్తు పదార్థాలకు బానిసలు కాదని పాయల్ వెల్లడించింది. డ్రగ్స్ టాపిక్ వస్తే అక్కడ నుండి వాటికి దూరంగా జరుగుతానని తెలిపింది. చాలామంది సెలబ్రిటీలు తామెందుకు డ్రగ్స్ తీసుకోకూడదని ట్రై చేస్తారట. అలా అలా తరవాత వాటికి అలవాటు పడతారని వివరించింది.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus