వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. మల్లెపూలు తీసుకెళ్ళినందుకు ఒక నటి ఏకంగా రూ.1.14 లక్షలు ఫైన్ కట్టింది. కేరళకు చెందిన నవ్య నాయర్ గురించి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలిసుండకపోవచ్చు. అక్కడ వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంది. కన్నడ, తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు పొందింది. అయితే ఈమె ఒకసారి ఆస్ట్రేలియా వెళ్లిందట.
అక్కడి ఎయిర్ పోర్టులో సిబ్బంది తనిఖీలు చేసే సమయంలో.. ఈమె బ్యాగ్లో మల్లెపూలు ఉన్నట్టు గుర్తించారు. ఓ ఈవెంట్ కోసం నవ్య నాయర్ అక్కడికి వెళ్తూ.. మల్లెపూలు కూడా తన బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళింది. అయితే ఎయిర్ పోర్టు సిబ్బంది ఆమెకు షాక్ ఇస్తూ.. అవి నిషేధం అని చెప్పారట. అంతేకాదు నవ్య నాయర్ కు ఏకంగా రూ.1.14 లక్షలు ఫైన్ వేశారట.
కఠినమైన బయో సెక్యూరిటీ సిస్టమ్ కలిగిన విమానాశ్రయాల్లో మెల్బోర్న్ ఒకటి. వాళ్ళు నిషిద్ధం అని ఎంచిన ఏ ఒక్కటీ.. కూడా తమ దేశంలోకి అనుమతించరు. చిన్న చిన్న పండ్లు, పూలు, విత్తనాలు వంటివి మంచివి కావు… వాటి వల్ల రోగాలు సంభవిస్తాయి అని అక్కడి జనాలు భావిస్తారు. ఈ విషయంలో అక్కడి కస్టమ్స్ అధికారులు చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే నవ్య నాయర్ కి భారీగా జరిమానా విధించారు. అటు తర్వాత అక్కడి కార్యక్రమంలో మాట్లాడిన నవ్య.. తాను తీసుకొచ్చిన మల్లెపూలు లక్షలు విలువగలవని చెప్పి.. తనకు జరిగిన చేదు అనుభవాన్ని వివరించింది.