‘ప్రభాస్ 20’ గురించి స్పందించిన పూజా హెగ్దే..!

‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి చిత్రాల తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా యాక్షన్ చిత్రాలనే చేస్తూ వచ్చాడు. ‘రెబల్’ ‘మిర్చి’ ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ ఇప్పుడు చేస్తున్న ‘సాహూ’ తో సహా అన్నీ యాక్షన్ కథలే కావడం విశేషం. అయితే చాలా కాలం తరువాత ఓ ప్రేమ కథా చిత్రాన్ని చేస్తున్నాడు ప్రభాస్. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘ప్రభాస్ 20’ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ‘ప్రభాస్ 20’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలిపింది పూజా హెగ్దే.

మనం చూసే ప్రతి ప్రేమకథలోనూ హీరో.. హీరోయిన్ల మధ్య ప్రేమ, అలగడం,బుజ్జగించడం, ప్రేమకు అడ్డుగా నిలిచిన వ్యక్తులతో పోరాడటం.. ఇలాంటి సందర్భాలు సహజమే. కానీ .. అలాంటి ప్రేమకథల్లో నటించడం అంత సులభం మాత్రం కాదని పూజ హెగ్దే చెబుతుంది. ఇక ఈ చిత్రం పై పూజా మాట్లాడుతూ.. “ప్రభాస్ 20… అమేజింగ్ స్క్రిప్ట్. ఇప్పటి వరకూ నేను నటించిన సినిమాల్లో చాలెంజింగ్ స్క్రిప్ట్ ఇదే.! కథ విన్నాక నేను సర్ ప్రైజ్ అయ్యాను. అంత అద్భుతంగా ఉంది ఈ కథ. ఇక నా పాత్ర విషయానికి వస్తే… అటువంటి పాత్రలో నటించడం చాలా కష్టం. చాలా చాలెంజింగ్ రోల్. సినిమా కోసం మేమంతా ఎంతగానో కష్టపడుతున్నాం. ఓ అందమైన సినిమా ఇది. యూనిక్ గా ఉంటుందని ప్రేక్షకులకు ప్రామిస్ చేస్తున్నా” అంటూ తెలియజేసింది పూజా హెగ్దే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus