పూజా హెగ్డే ని ఓ ఆటాడేసుకున్న నెటిజెన్స్

  • May 28, 2020 / 06:45 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే చిక్కులలో పడింది. ఆమె అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఆకతాయిలు ఎవరో హ్యాక్ చేశారు. అంతటితో ఆగకుండా సమంతపై వారు ఓ బ్యాడ్ పోస్ట్ పెట్టారు. అసలు నిజం తెలియని నెటిజెన్స్ పూజా పై విరుచుకుపడ్డారు. ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడం మరియు, విమర్శించడం మొదలుపెట్టారు. దీనితో పూజా తేరుకొని తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని చెప్పే వరకు సోషల్ మీడియా వార్ నడించింది.

ఐతే పూజా వివరణ ఇచ్చే లోపే జరగాల్సిన నష్టంజరిగిపోయింది . ఇక పూజ టీమ్ తన అకౌంట్ ని మరలా ఆమె ఆధీనంలోకి తెచ్చే పనిలో పడ్డారట. ఇక పూజా కెరీర్ లో దూసుకు పోతుంది. ఆమె తెలుగులో ప్రభాస్ హీరోగా భారీ పీరియాడిక్ మూవీలో నటిస్తుంది. అలాగే యంగ్ హీరో అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో కూడా నటిస్తుంది. ఈమె నటించిన చిత్రాలు వరుస విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో నిర్మాతలు పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారు.

ఇక నెక్స్ట్ ఈమె సల్మాన్ హీరోగా కభీ ఈద్ కభీ దివాలి చిత్రాలలో నటిస్తుంది. ఆ మూవీ కనుక విజయం సాధిస్తే పూజ దశ తిరిగినట్లే. అక్కడ అవకాశాలు రావడంతో టాలీవుడ్ పై కొంచెం ఫోకస్ తగ్గించింది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus