ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన పూనమ్ కౌర్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూనమ్ కౌర్ వేర్వేరు అంశాల గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పూనమ్ కౌర్ కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. రాహుల్ గాంధీని కలిసిన పూనమ్ కౌర్ చేనేత కార్మికుల సమస్యలను రాహుల్ గాంధీకి వివరించారు.
చేనేత చీరలో రాహుల్ గాంధీతో చేతిలో చెయ్యి వేసి నడుస్తూ పూనమ్ కౌర్ సమస్యలను వెల్లడించారు. రాహుల్ ను పూనమ్ కౌర్ కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వైపుగా రాహుల్ పాదయాత్ర సాగుతుండగా కేంద్రం అమలు చేస్తున్న జీఎస్టీని చేనేత కార్మికుల వస్త్రాలపై తొలగించాలని ఆమె కోరారని సమాచారం. పూనమ్ కౌర్ పాలిటిక్స్ లోకి రావాలని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా రాబోయే రోజుల్లో ఆమె రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తారేమో చూడాల్సి ఉంది.
మరి కొందరు ఫ్యాన్స్ మాత్రం పూనమ్ కౌర్ సినిమాల్లో యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారు. అయితే సినిమాలు, రాజకీయాల విషయంలో పూనమ్ కౌర్ మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో కూడా పూనమ్ కౌర్ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. పూనమ్ కౌర్ భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి త్వరలో స్పష్టత రానుంది.
కెరీర్ విషయంలో పూనమ్ కౌర్ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పూనమ్ కౌర్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. పూనమ్ కౌర్ పరిమితంగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పూనమ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!