2022 లో చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టారు. అందులో పూర్ణ కూడా ఒకరు. తెలుగు తమిళ మలయాళ భాషల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూర్ణ.. వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి వరుస సినిమాల్లో నటిస్తోంది. అయితే గతేడాది దుబాయ్ బేస్డ్ బిజినెస్ మెన్ ఆసిఫ్ అలీని చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహం దుబాయ్ లో ఎంతో ఘనంగా జరిగింది.
జూన్ 12న ఈమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక తాజాగా ఈమె ప్రెగ్నెంట్ అయినట్టు కూడా తెలిపింది పూర్ణ.దీంతో ఆమె ఫాలోవర్స్ సోషల్ మీడియాలో తమ బెస్ట్ విషెస్ ను తెలియజేశారు. అయితే అలా ఈమె ప్రెగ్నెన్సీ వార్త బయటకు వచ్చిందో లేదో అప్పుడే ఈమె బేబీ బంప్ ఫోటోలు అంటూ కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో ఆమె బొద్దుగా కనిపిస్తుంది. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని మీరు కూడా ఓ లుక్కేయండి :