Actress Poorna: పెళ్లి పీటలెక్కబోతున్న పూర్ణ.. వరుడు ఎవరంటే?

మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణకు తెలుగు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఈ మధ్య కాలంలో వరుస సినిమా ఆఫర్లతో, టీవీ షోలతో పూర్ణ బిజీ అవుతున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ సినిమా సక్సెస్ తో పూర్ణకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఈటీవీలో ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేస్తూ పూర్ణ క్రేజ్ ను పెంచుకుంటున్నారు. అయితే తాజాగా పూర్ణ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.

షానిద్ అసీఫ్ అలీ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ పెళ్లి జరగనుందని పూర్ణ చెప్పడం గమనార్హం. పూర్ణ నుంచి ఈ మేరకు ప్రకటన రావడంతో అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. పూర్ణకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. కాబోయే భర్తతో దిగిన ఫోటోలను పూర్ణ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

షానిద్ అసీఫ్ అలీ జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సీఈవో అని అతని సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడవుతోంది. షానిద్ అసీఫ్ అలీకి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త్వరలోనే పూర్ణకు పెళ్లి కాబోతుందని తెలిసి కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఫీలవుతున్నారు. పూర్ణ తెలుగు కూడా బాగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే. తనపై ఎవరైనా పంచ్ లు వేసినా ఆమె ఎంతో స్పోర్టివ్ గా తీసుకుంటారు.

పూర్ణ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అయితే పూర్ణ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఎక్కడ పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. పూర్ణ రెమ్యునరేషన్ పరంగా డిమాండ్లు చేయకపోవడంతో ఆమెకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus