హీరోయిన్ పూర్ణను వేధించన వాళ్ళు ఆ నలుగురేనా..!
- June 25, 2020 / 12:15 PM ISTByFilmy Focus
‘శ్రీమహాలక్ష్మి’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది షామ్నా కాసిమ్.. అదేనండీ పూర్ణ. ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో ఈమెకు గుర్తింపు రాలేదు. అయితే అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’ చిత్రం ఈమెను తెలుగు ప్రేక్షకులకు దగ్గరచేసింది. తరువాత ఈమె నటించిన ‘అవును’ ‘అవును2’ ‘లడ్డు బాబు’ ‘మామ మంచు అల్లుడు కంచు’ వంటి చిత్రాలు పెద్దగా ఆడలేదు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ‘సిల్లీ ఫెలోస్’ వంటి చిత్రాలు బాగానే ఆడినా ఈమెకు కలిసి రాలేదనే చెప్పాలి.
దీంతో ఈమెకు అవకాశాలు కూడా తగ్గాయి. ఇదిలా ఉండగా.. లాక్ డౌన్ కారణంగా ఈమె తన సొంత ఊరు కేరళలో ఉన్న తన ఇంట్లోనే ఉంటూ వస్తుంది. ఇప్పుడు ఈమెకు పెళ్లి కూడా ఫిక్స్ అయ్యిందట. దాంతో ఆ పనుల్లో వీళ్ళ కుటుంబ సభ్యులు బిజీగా ఉండడంతో.. గత కొంత కాలంగా ఈమెకు .. కొందరు ఫోన్ చేసి డబ్బు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారట. అంతేకాదు ఈమె సోషల్ మీడియాలో పేజీలలో కూడా వాళ్ళు అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టి.. ఈమెను ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తుంది.

దాంతో ఈమె పోలీసులను ఆశ్రయించిందట. ఈమె కంప్లైంట్ పై వెంటనే స్పందించిన పూర్ణ ను.. తనను వేధిస్తున్న వారిని పట్టుకున్నారట. వాళ్ళ పేర్లు శరత్, అష్రఫ్, రఫీజ్, రమేష్‌గా గుర్తించారట పోలీసులు. గతంలో కూడా వీళ్ళు ఇలాంటి బ్లాక్ మెయిల్స్ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు.
1

2

3

4

5

6

7

8

Suvarna Sundari Actress Poorna Black Dress Photos
9

10

11

12

13

14

15

16
17

18

19

20

Most Recommended Video
కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే












