సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ విషయం గురించి ఇప్పటికే ఎంతోమంది యంగ్ హీరోయిన్స్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు కెరియర్ మొదట్లో తాము ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ ఎంతోమంది ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడారు. తాజాగా 8 పదుల వయసులో ఉన్నటువంటి నటి ప్రమీల రాణి కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నటి ప్రమీల రాణి ఎన్నో సినిమాలలోను అలాగే బుల్లితెర సీరియల్స్ లోను నటించి మెప్పించారు. ఈమె విక్రమార్క, వేదం, బాహుబలి సినిమాలలో నటించి మెప్పించారు. అలాగే బుల్లితెర సీరియల్స్ లో మనసు మమత సీరియల్ లో కీలక పాత్రలో నటించారు. ఇలా నటిగా పలు సినిమాలు సీరియల్స్ లో నటిస్తున్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలో తనకు ఎదురైనటువంటి చేదు అనుభవాలను బయటపెట్టారు.
ఈ సందర్భంగా ప్రమీల రాణి (Pramila Rani) మాట్లాడుతూ తనకు 23 సంవత్సరాల వయసుకే రెండు పెళ్లిళ్లు జరిగాయని తెలిపారు. 14 సంవత్సరాల వయసులో పెళ్లి జరిగిందని అయితే ఆ సమయంలో అనారోగ్యానికి గురి కావడంతో డాక్టర్లు నాకు పిల్లలు పుట్టరని చెప్పగా తన భర్త వదిలేసారని తెలిపారు. అయితే కొన్ని రోజుల తర్వాత మరొక వివాహం జరిగిందని బాబు పుట్టిన తర్వాత 23 ఏళ్ల వయసుకే తన భర్త చనిపోవడంతో సినిమాలలోకి వచ్చానని తెలిపారు.
ఇలా సినిమాలలో కొనసాగుతున్నటువంటి తాను పలు సందర్భాలలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఈమె తెలియజేశారు. ఒక ప్రొడక్షన్ వారు తనకు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి గెస్ట్ హౌస్ కి రమ్మంటూ మాట్లాడారు ఇలా మాట్లాడటంతో తాను ఇబ్బందికర పరిస్తితులలో ఉన్నప్పటికీ ఆ సినిమా ఛాన్స్ వదులుకున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !