Pranitha: తన భర్త, పాప కి గుండు కొట్టించిన ప్రణీత … వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్‌ అందరికీ సుపరిచితమే. అందంతో పాటు అణుకువ గల నటి ఈమె.  ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీత తర్వాత బావ వంటి సినిమాల్లో నటించింది.అయితే ఈమెకు బ్రేక్ ఇచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ తో చేసిన అత్తారింటికి దారేది మాత్రమే అని చెప్పాలి. తరువాత పలు పెద్ద సినిమాల్లో నటించింది కానీ అవి ఈమెకు సక్సెస్ ఇవ్వలేదు.

తర్వాత కోవిడ్ లో ఈమె చేసిన పుణ్యకార్యాల వల్ల బాలీవుడ్లో కూడా ఈమెకు అవకాశాలు దక్కాయి. పాపం అవి కూడా ఈమెకు కలిసి రాలేదు. దీంతో సెకండ్ లాక్ డౌన్ టైంలో ఈమె బెంగళూరుకు చెందిన వ్యాపార వేత్త నితిన్ రాజుని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టింది. ఇక జూన్ నెలలో ఈమె పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పాపకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా తన భర్త, పాప గుండు కొట్టించుకున్న ఫోటోలను షేర్ చేసింది ప్రణీత. ‘ మై టు బోడి బేబీస్ ‘ అంటూ కామెంట్ పెట్టి ఈ ఫోటోలను షేర్ చేసింది ప్రణీత. తాజాగా ప్రణీత.. తన భర్త , పాపతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వి. ఐ.పి కేటగిరీలో వీరు స్పెషల్ దర్శనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రణీత రెడ్ శారీలో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి:


 

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus