Prema, Trivikram: త్రివిక్రమ్ వల్లే నేను త్వరగా ఫేడౌట్ అయిపోయాను: ప్రేమ

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రేమ అందరికీ సుపరిచితమే. ధర్మ చక్రం, కోరుకున్న ప్రియుడు, మా ఆవిడ కలెక్టర్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఆమె ఓ టైంలో ఫేడౌట్ అయిపోయింది అనుకున్న టైంలో కోడి రామకృష్ణ గారు తెరకెక్కించిన దేవి చిత్రం వల్ల ఈమె మళ్లీ ఫాంలోకి వచ్చింది. అంతేకాదు ఆమె క్రేజ్ కూడా డబుల్ అయ్యింది అని చెప్పాలి. ఆ తర్వాత కూడా హీరోయిన్ గా పలు క్రేజీ సినిమాల్లో నటించింది.

కానీ చిరునవ్వుతో అనే సినిమా ఈమె ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది అన్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసింది. ముఖ్యంగా త్రివిక్రమ్ వల్లే తాను త్వరగా ఫేడౌట్ అయినట్టు ఈమె చెప్పుకొచ్చింది. చిరునవ్వుతో సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్ రైటర్ గా పనిచేశారు. జి.రామ్ ప్రసాద్ దర్శకుడు. ఈ సినిమాలో నటి ప్రేమ హీరోని పెళ్లి చేసుకునే టైంలో వేరే అబ్బాయి కోసం లేచిపోయే అమ్మాయి పాత్ర పోషించింది. అయితే త్రివిక్రమ్ ఆమెకు మీది హీరోయిన్ లాంటి పాత్ర …

కథ మొత్తం మీ పాత్ర చుట్టూనే తిరుగుతుంది అని చెప్పాడు. సినిమా చేసే టైంలో కూడా నాకు అనిపించింది …’ హీరోయిన్ గా ఇంకా మంచి ఆఫర్లు వస్తున్నాయి.. ఇలాంటి టైంలో ఈ పాత్ర చేస్తున్నాను ఏంటి ‘ అని నాకు అనిపించింది. సినిమా రిలీజ్ అయ్యాక హీరోయిన్ వేరే ఆమె ఉంది.

నాది సహాయ నటి పాత్ర అయిపోయింది. ఆ సినిమా వల్ల తరవాత నాకు అన్నీ అలాంటి పాత్రలు వచ్చాయి. చిరునవ్వుతో విషయంలో త్రివిక్రమ్ నన్ను చాలా మోసం చేశాడు. ‘ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus