ఘనంగా వంటలక్క భర్త పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

‘కార్తీక దీపం’ సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్ కోసం గృహిణిలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. ఈ సీరియల్ లో నటించిన వారంతా బాగా పాపులర్ అయ్యారు. ఈ లిస్ట్ లో ప్రధమంగా చెప్పుకోవాల్సింది మన వంటలక్క అలియాస్ దీప గురించి. ఈ పాత్రను పోషించింది ప్రేమీ విశ్వనాధ్. కేరళకు చెందిన ఈ నటి ‘కార్తీక దీపం’ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.

‘మాతృదేవోభవ’ సినిమా తర్వాత ప్రేక్షకులను అంతలా ఏడిపించిన ఘనత వంటలక్కకే చెందుతుంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వంటివి వస్తుంటాయి. మొన్నామధ్య ఈమె సీరియల్ లో కనిపించకపోయేసరికి టి.ఆర్.పి రేటింగ్ అమాంతం పడిపోయింది. దీంతో ప్రీక్వెల్ స్టైల్ లో మళ్ళీ ఈ పాత్రలను ఎంటర్ చేసి సీరియల్ ను నడుపుతున్నాడు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర. ఇదిలా ఉండగా.. ప్రేమి విశ్వనాథ్ కేరళకు చెందిన నటి అన్న సంగతి తెలిసిందే.

ఆమె భర్త అక్కడ పెద్ద జోతిష్యుడు. అతని పేరు వినీత్ భట్. తన భర్తకు సంబంధించిన ఫోటోలను ప్రేమి తన సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేయదు. అయితే నవంబర్ 16న తన భర్త పుట్టినరోజు సందర్భంగా.. వినీత్ భట్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus