Priya, Nagarjuna: ‘బిగ్ బాస్5’ ప్రియతో నాగ్.. వైరల్ అవుతున్న పాత ఫోటో..!

‘బిగ్ బాస్5′ ప్రియ అందరికీ సుపరిచితమే. గతంలో ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది.’చిరునవ్వుతో’ ‘మిర్చి’ ‘బాబు బంగారం’ వంటి సినిమాల్లో ఈమె నటించింది. అంతకు ముందు ఈమె చాలా సీరియల్స్ లో నటించిన సంగతి కూడా తెలిసిందే.ఈటీవీలో ప్రసారమయ్యే ‘ప్రియసఖి’ అనే సీరియల్ ఈమెకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఇక ‘బిగ్ బాస్’ హౌస్ లో ఈమె చాలా కూల్ గా ఆడుతూ వస్తోంది. సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫోలోయింగ్ కూడా ఎక్కువే.

హౌస్ లో చాలా మంది అమ్మాయిలు ఉన్నప్పటికీ మెయిన్ గ్లామర్ మాత్రమే ప్రియ మాత్రమే అంటూ సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. ప్రియ.. నాగార్జునతో కలిసి ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 1998 వ సంవత్సరం జూలై 30న నాగార్జున హీరోగా నటించిన ‘చంద్రలేఖ’ అనే మూవీ రిలీజ్ అయ్యింది.క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మన ‘బిగ్ బాస్5’ ప్రియ కూడా ఓ చిన్న పాత్రని పోషించింది. ఈ చిత్రంలో ఆమె బంగారి అనే పాత్రని పోషించింది.

సినిమాలో సెకండ్ హీరో రేంజ్ పాత్రని పోషించిన బ్రహ్మాజీ.. పెళ్లి చేసుకునే అమ్మాయిగా ఈమె కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఆ చిత్రంలోనిదే. ఇటీవల ప్రియ ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటో షేర్ చేసి ఉంది. ’23 ఏళ్ళ నుండీ ఈ మెమొరీ నన్ను ఫాలో అవుతూ బిగ్ బాస్ ప్లాట్ ఫామ్ వరకు తెచ్చింది.. థాంక్యూ నాగార్జున గారు’ అంటూ ఓ కామెంట్ కూడా పెట్టి ఉంది. ఈ పోస్ట్ కొద్దిరోజుల నుండీ వైరల్ అవుతుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus