Priya Varrier: ఆమెకి మతిస్థిమితం లేదంటూ డైరెక్టర్ కౌంటర్..అసలు ఏం జరిగింది?

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం కష్టపడుతోంది. ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి ఎలాంటి విజయాలు దక్కలేదు.

ఓరు ఆధార్ లవ్ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేమీ సక్సెస్ కాలేదు. తేజ సజ్జ సరసన ఇష్క్, నితిన్ కి జోడిగా చెక్ చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు నిరాశ పరిచాయి. ఐదేళ్ల క్రితం ప్రియా వారియర్ కన్నుగీటిన వీడియోతో సృష్టించిన సంచలనం ఇప్పుడు వివాదంగా మారింది. కన్నుగీటిన వీడియో క్రెడిట్ విషయంలో ప్రియా వారియర్.. ఆ చిత్ర దర్శకుడు ఒమర్ లులు రచ్చకెక్కారు. ఆ సాంగ్ వచ్చిన ఐదేళ్ల తర్వాత ఇలా వివాదం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియా వారియర్ మాట్లాడుతూ.. ఒరు ఆధార్ లవ్ చిత్రంలో దేశవ్యాప్తంగా వైరల్ అయిన కన్ను గీటిన వీడియో ఐడియా నాదే అని ప్రియా వారియర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రియా వారియర్ కామెంట్స్ దర్శకుడు ఒమర్ కు ఆగ్రహాన్ని తెప్పించినట్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఐదేళ్ల క్రితం ఓరు ఆధార్ లవ్ ప్రమోషన్ లో ప్రియా వారియర్ చెప్పిన మాటలని గుర్తు చేశాడు. ఆ వీడియో పోస్ట్ చేశారు.

రీసెంట్ ఇంటర్వ్యూలో (Priya Varrier) ప్రియా వారియర్ ఆ ఐడియా నాదే అని చెప్పగా.. ఐదేళ్ల క్రితం మాత్రం ఇది దర్శకుడి ఐడియా అని చెప్పింది. దీనితో ఒమర్ కామెంట్స్ చేస్తూ ఆమె పూర్ చైల్డ్.. మెమొరీ లాస్ అయినట్లు ఉంది. మెమొరీ లాస్ కి వైద్యం చెసించుకుంటే మంచిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus