Priyamani: ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టేసిన ప్రియమణి ఏమైందంటే?

ప్రియమణి.. పరిచయం అవసరం లేని పేరు. 2003 లో వచ్చిన ‘ఎవరే అతగాడు’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె ఫేమస్ అయ్యింది ‘పెళ్ళైన కొత్తలో’ సినిమాతోనే అని చెప్పాలి. ఆ సినిమా తర్వాత ప్రియమణి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఎన్టీఆర్ తో ‘యమదొంగ’ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్సులు దక్కించుకుంది. అయితే తర్వాత ఈమెకు కొత్త హీరోయిన్ల నుండి పోటీ ఎదురవడంతో సహజంగానే అవకాశాలు తగ్గాయి.

కొంత గ్యాప్ తర్వాత ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈమె చేస్తున్న ఓటీటీ ప్రాజెక్టులు సక్సెస్ అవుతున్నాయి. కానీ థియేట్రికల్ గా ఈమె చేసే సినిమాలు వర్కౌట్ అవ్వడం లేదు. ఇది పక్కన పెట్టేస్తే.. ఈమె ప్రధాన పాత్ర పోషించిన ‘భామాకలాపం 2’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని కోసం ఆమె ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంది. ఈ క్రమంలో ఆమె కొన్ని ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టేసి షాక్ ఇచ్చింది.

అదేంటి అంటే.. ఎయిర్ పోర్ట్, జిమ్ వంటి ప్రదేశాల్లో సెలబ్రిటీలు కనిపించినప్పుడు ఫోటో గ్రాఫర్లు ఎగబడి వచ్చి వారిని ఫోటోలు తీస్తూ ఉంటారు. సరిగ్గా సెలబ్రిటీలు బయటకు వస్తున్నప్పుడు లేదా లోపలి వెళ్తున్నప్పుడు.. ఫోటోగ్రాఫర్లకు ఆ విషయం ఎలా తెలుస్తుంది అనే అనుమానం కొందరికి కలగకమానదు. వీటికి ప్రియమణి క్లారిటీ ఇచ్చేసింది.

‘అదంతా పీఆర్ స్ట్రాటజీ అని.. వాళ్ళే సెలబ్రిటీల గురించి సమాచారం అందించి, పనైపోయాక వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారని, అంతేకాకుండా పీఆర్..లు చాలా వరకు డబ్బులు నొక్కేస్తారని.బాలీవుడ్లో ఈ సంస్కృతి ఎక్కువగా ఉందని’ ప్రియమణి (Priyamani) చెప్పి షాక్ ఇచ్చింది.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus