Priyamani: ప్రియమణికి నెటిజన్ రిక్వెస్ట్..!

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం బాగా తగ్గింది. నెటిజన్లు సోషల్ మీడియా ఖాతాల ద్వారా సెలబ్రిటీలకు నేరుగా మెసేజ్ లు చేస్తున్నారు. కొందరు అభిమానంతో మెసేజ్ లు చేస్తుంటే.. మరికొందరు మాత్రం హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు సోషల్ మీడియా వలన తలనొప్పులు తప్పడం లేదు. తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా చెలామణి అయింది. పెళ్లి తరువాత తన కెరీర్ కాస్త స్లో అయింది.

సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి మళ్లీ సినిమాలతో బిజీ అవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘విరాటపర్వం’, ‘నారప్ప’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల మోడ్రన్ డ్రెస్ లో ప్రియమణి షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇవి చూసిన ఓ నెటిజన్.. ఏకంగా న్యూde ఫోటో షేర్ చేయమని ప్రియమణిని అడిగాడు.

సాధారణంగా ఇలాంటి కామెంట్స్ ని సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోరు కానీ ప్రియమణి మాత్రం వెంటనే రియాక్ట్ అవుతూ.. అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ”మీ తల్లిని అలానే మీ సోదరిని అలాంటి ఫోటోలు అడిగి పోస్ట్ చేయండి. అప్పుడు నేను కూడా పోస్ట్ చేస్తాను” అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. దీంతో వెంటనే సదరు నెటిజన్ క్షమించండి అంటూ వేడుకున్నాడు. ప్రియమణి చాకచక్యంగా వ్యవహరించడాన్ని చూసిన నెటిజన్లు ఆమెని మెచ్చుకుంటున్నారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus