Priyanka Chopra: ఇంట్లో అడుగుపెడితే స్వర్గంలా ఉంటుంది : ప్రియాంక చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిగా ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ఇప్పటికీ వరుస సినిమా ఛాన్స్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం ప్రముఖ ర్యాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రియాంక వివాహం చేసుకున్నారు. ప్రియాంక చోప్రాతో పోలిస్తే నిక్ జోనస్ వయస్సులో ఏకంగా పది సంవత్సరాలు చిన్న వ్యక్తి కావడం గమనార్హం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియాంక లాస్ ఏంజెల్స్ లో ఉన్న తన ఇంటి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తనకు లాస్ ఏంజెల్స్, న్యూయార్క్, ముంబైలలో నివాసాలు ఉన్నాయని ప్రియాంక చోప్రా తెలిపారు. ఇంట్లో ఉంటే తనకు స్వర్గంలో ఉన్న భావన కలుగుతోందని.. ఇంట్లో ఉండే మనుషుల వల్ల తన మనస్సు ఎంతో ఉల్లాసంగా ఉంటుందని.. కెరీర్ పరంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఇంటిలో సంతోషం, ప్రశాంతత లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. మీడియాలో ప్రియాంకకు లాస్ ఏంజెల్స్ లో ఉన్న ఇంటి విలువ ఏకంగా 144 కోట్ల రూపాయలు అని ప్రచారం జరుగుతోంది.

ఈ ఇంటిలోని లివింగ్ రూమ్ కోసం ప్రియాంక చోప్రా కోట్ల రూపాయలు ఖర్చు చేశారని.. ఈ ఇంటి కొరకు అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ను వినియోగించారని తెలుస్తోంది. మార్బుల్ మరియు ఇతర స్టోన్స్ తో బ్రౌన్, వైట్ కలర్ లో అందంగా ప్రియాంక చోప్రా ఇంటిని డిజైన్ చేసుకున్నారని సమాచారం. లాస్ ఏంజెల్స్ లోని ఎన్‌సినో ప్రాంతంలో ఉన్న ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా ఇంటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయం తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

అమెరికా కరెన్సీ ప్రకారం ప్రియాంక చోప్రా ఇంటి కోసం ఏకంగా 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ 2017లో ఒక ఈవెంట్ లో ఒకరికొకరు పరిచయమయ్యారు. జోధ్ పూర్ లోని ఒక ప్యాలేస్ లో 2018 డిసెంబర్ లో ప్రియాంక నిక్ ల వివాహం జరిగింది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus