సరికొత్త లుక్ లో దర్శనమిచ్చిన రాశి..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి గురించి ఈ జనరేషన్ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు… కానీ ఒకప్పటి ప్రేక్షకులకు మాత్రం ఈమె సుపరిచితమే..! దశాబ్దం క్రితం వరకూ రాశి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, ప్రేయసి రావే, గోకులంలో సీత, స్నేహితులు, దేవుళ్ళు.. వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఈమె నటించింది. ఇక హీరోయిన్ గా ఈమెకు అవకాశాలు తగ్గిన తరుణంలో.. ‘నిజం’ ‘కళ్యాణ వైభోగం’ ‘లంక’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది.

కానీ అవి కూడా సక్సెస్ కాలేదు.ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె గురించి కొన్ని వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.రాశీ ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని ప్రచారం నడిచింది. అయితే ‘ఆ ప్రచారంలో నిజం లేదని.. నాకు డబ్బులకు ఎటువంటి లోటు లేదని’ రాశి చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకూ చీరల్లోనే ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తూ వచ్చిన రాశి.. సడెన్ గా బోల్డ్ లుక్ లో కనిపించి అందరికీ షాకిచ్చింది.

సినిమాలు చెయ్యడం తగ్గించాక చాలా లావుగా తయారైన రాశి.. ఇప్పుడు చాలా సన్నపడింది. ఇప్పుడు రాశి కొత్త ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లుక్ లో చాలా సన్నగా కనిపిస్తుంది రాశి. పోలీస్ గెటప్ లో రాశి కనిపిస్తుంది. ఇదిలా ఉండగా… ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ చిత్రంలో ‘రంగమ్మత్త’ వంటి పాత్రను రాశి చెయ్యాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేసినట్టు రాశినే చెప్పుకొచ్చింది.ఇక ఇప్పుడు వరుస సినిమాల్లో నటించాలని రాశి కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus