సినిమా రంగంలో 20 ఏళ్లకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి 60, 70 సంవత్సరాలకు కూడా హీరోగానే సినిమాల్లో నటిస్తారు. అయితే హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పది, పదిహేను సంవత్సరాల తరువాత అక్క, వదిన, అమ్మలాంటి పాత్రలు చేయాల్సి వస్తుంది. కొంతమంది హీరోలతో హీరోయిన్లుగా నటించిన వాళ్లే ఆ హీరోలకు తల్లిగా కూడా నటించే పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో ఉంది. ప్రముఖ నటి రాధిక ఇండస్ట్రీలో నెలకొన్న ఈ పరిస్థితి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా రంగంలో హీరోల రెమ్యునరేషన్ కు, హీరోయిన్ల రెమ్యునరేషన్ కు వ్యత్యాసం ఎక్కువగా ఉంటుందని రాధిక అన్నారు. ఇండస్ట్రీలో హీరో ఎప్పటికీ హీరోగానే చలామణి అవుతారని 50, 60 సంవత్సరాల వయస్సు వచ్చినా హీరోగా చేసే అవకాశం సినిమా ఇండస్ట్రీలో ఉందని.. హీరోయిన్లకు మాత్రం 30 సంవత్సరాల వయస్సు దాటితే హీరోయిన్ గా అవకాశాలు రావని రాధిక అన్నారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రాధిక ఈ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది హీరోయిన్లు మాత్రమే 30 సంవత్సరాల తర్వాత కూడా హీరోయిన్ రోల్స్ లో నటిస్తున్నారని రాధిక పేర్కొన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కు జోడీగా చాలా సినిమాల్లో నటించిన రాధిక భవిష్యత్తులో తనను రజనీకి తల్లిగా నటించమని దర్శకనిర్మాతలు కోరే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అయితే తాను మాత్రం కెరీర్ విషయంలో ప్రతి మైలురాయికి బెటర్ అవుతున్నానని అన్నారు. తన సినీ ప్రయాణం అందరికీ సింపుల్ గా అనిపించినా.. తన జర్నీ అంత సులభంగా జరగలేదని ఆమె అన్నారు. తాను లెజండరీ యాక్టర్ ఎం రాధ కూతురునని అయితే ఈ విషయం చాలామందికి తెలియదని ఆమె అన్నారు. ఎలాంటి అంచనాలు, కలలు లేకుండా కెమెరా ముందుకు వచ్చి ఈ స్థాయికి చేరానని రాధిక తెలిపారు.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!