Rashmika: రష్మిక టాలీవుడ్ కు గుడ్ బై చెబుతున్నారా..?

భాషతో సంబంధం లేకుండా కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రష్మిక మందన్నా గుర్తింపును సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సైతం రష్మిక మందన్నా గట్టి పోటీని ఇస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. సిద్దార్థ్ మల్హోత్రాకు జోడీగా మిషన్ మజ్ను సినిమాలో నటిస్తున్న రష్మిక ఈ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్ తో గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండగా ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమాలు రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా రష్మిక ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెబితే తన తల్లిదండ్రులే తనను నమ్మలేదని ఆమె పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు అమితాబ్ బచ్చన్ కు ఫ్యాన్స్ అని అమితాబ్ నటించిన సినిమాలను వాళ్లు తప్పకుండా చూస్తారని ఆమె పేర్కొన్నారు. గుడ్ బాయ్ సినిమాలో అమితాబ్ బచ్చన్ కు కూతురు పాత్రలో రష్మిక నటిస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే రష్మిక లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గమనార్హం. మరోవైపు రష్మిక తెలుగులో పుష్ప సినిమాతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు హిట్టైతే రష్మికకు తెలుగులో ఆఫర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మికకు వరుస ఆఫర్లు వస్తుండటంతో రష్మిక రాబోయే రోజుల్లో టాలీవుడ్ కు గుడ్ బై చెబుతారంటూ ప్రచారం జరుగుతోంది. రష్మిక తెలుగులో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus