గ్లామర్ షోకి రెడీ అంటున్న రష్మిక మందన
- May 10, 2019 / 01:33 AM ISTByFilmy Focus
‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందన. ఆ తరువాత ‘గీత గోవిందం’ చిత్రంతో కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ‘దేవదాస్’ వంటి క్రేజీ మల్టీ స్టారర్ చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పటి వరకూ చాలా పద్దతిగా కనిపించింది రష్మిక. కాస్త గ్లామర్ షో కి, రొమాంటిక్ సీన్లకి కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. అల్లాంటి స్క్రిప్టులు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిందట. అయితే ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ఆ లోటుని తీర్చేస్తుందట.
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
భరత్ కమ్మ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక.. విజయ్ తో లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోతుందని తాజా సమాచారం. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మొదట మే లో విడుదల కావాల్సినప్పటికీ.. జులై 26 కు మార్చారు. దీనికి ముఖ్య కారణం రీషూట్లే కారణమని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్లో ఈ చిత్రం మరో సూపర్ హిట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.














