నా పై ఎవరు కోపంగా ఉన్నారు? ఆధారాలు కావాలి : రష్మిక

‘ఛలో’ చిత్రంతో టాలీవూడ్ కి పరిచయమయ్యింది రష్మిక మందన. ‘గీత గోవిందం’ ‘దేవదాస్‌’ చిత్రాలతో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది ఈ భామ. ప్రస్తుతం తెలుగులో విజయ్‌ దేవరకొండ హీరోగా వస్తున్న ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది. దీనితో పాటు నితిన్‌ హీరోగా… ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న ‘భీష్మ’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించనుంది. ఇక మరోపక్క కన్నడంలో కూడా ‘యజమాన’, ‘పొగరు’ అనే చిత్రాల్లోనూ హీరోయిన్ నటిస్తుంది.

ఇదిలా ఉంటే… ఈ మధ్య రష్మిక తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని… వరుసగా కన్నడ చిత్రాలను రిజెక్ట్ చేస్తుందని… అసలు ఒక్క చిత్రాన్ని కూడా ఓకే చేయడం లేదని ఓ వెబ్‌సైట్‌ రాసుకొచ్చింది. ‘రష్మిక విషయంలో అప్‌సెట్‌ అయిన కన్నడ చిత్ర పరిశ్రమ’ అనే శీర్షికతో వార్తను ప్రచురించింది. దీని పై రష్మిక …. ఆ వెబ్‌సైట్‌ పై వ్యగ్యంగా స్పందించింది. ఈ విష్యం పై రష్మిక తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… “నా సొంత చిత్ర పరిశ్రమ పై నేను కోపంగా ఉండటం ఏంటి? ఎవరు కోపంగా ఉన్నారో నాకు చెప్పండి? ఎవరు ఇలా అన్నారు? ఇలా అడుగుతున్నానని నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి.., కానీ నాకు తెలుసుకోవాలని ఉంది. నాకు నేరుగా మెసేజ్‌ చేయండి. సాధారణంగా నేను ఇలాంటివి అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నా చిత్ర పరిశ్రమ గురించి మీరు ఇలా రాయడం, వారు నాపై కోపంగా ఉన్నారని చెప్పడంలో అర్ధమే లేదు. నేను దీన్ని నమ్మను. నాకు ఆధారాలు కావాలి. ఇవ్వండి.. నాకు నేరుగా మెసేజ్‌ చేయండి…” అంటూ నవ్వుతున్న ఈమోజీని పెట్టి ఆ వార్తని ట్వీట్‌ చేసింది రష్మిక.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus