సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా? లేదా? ఉంటే ఎవరు కారణం? సమస్య ఎక్కడ ఉంది? అంటూ కొన్ని ప్రశ్నలు మనల్ని చాలా రోజులుగా వేధిస్తున్నాయి. రోజూ ఏదో ఒక చోట, ఎవరో ఒకరికి సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురవుతుంది అని అంటే టూ హార్ష్‌గా అనిపించొచ్చు కానీ.. గ్రౌండ్ రియాలిటీ ఇదే అంటారు. అయితే తాజాగా ఓ చర్చాగోష్టిలో ప్రముఖ నటి రేవతి చేసిన కొన్ని కామెంట్స్ ఆలోచించే విధంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాల గురించి జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ మేరకు రేవతి వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన చర్చలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో ఒకప్పుడు ఇండస్ట్రీలో తాము ఎదుర్కున్న పరిస్థితుల గురించి నటీమణులు చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పటి పరిస్థితికి కారణం కూడా చెప్పారు.
మొబైల్ ఫోన్లు, మెసేజింగ్‌తోనే చాలా సమస్యలు ముడిపడి ఉన్నాయి అంటూ (Revathi) రేవతి సంచలన కామెంట్స్ చేశారు. వాటి వల్లే క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులు సినిమా పరిశ్రమలో ఈ పరిస్థితులు అని నేను నమ్ముతాను అంటూ రేవతి క్లారిటీ ఇచ్చారు. కళ్లలోకి చూస్తూ… నాకు నువ్వు కావాలి, నాతో ఉండు అని తప్పుడు ఉద్దేశ్యంతో అడగడం అంత ఈజీ కాదు. కానీ మెసేజ్‌లతో ఆ పని చేసేస్తున్నారు. కలుద్దామా, కాఫీ తాగుదామా అని ఫోన్లలో అడిగేస్తున్నారు అంటూ తన వాదన వెనుక ఉద్దేశం చెప్పారు రేవతి.
అలా సినిమా పరిశ్రమలో మొబైళ్ల వల్లే ఈ పరిస్థితి వచ్చింది మొబైల్ ఫోన్ల వల్ల ఎమోజీల వాడకం కూడా ఓ కారణం అని చెప్పారామె. ఎమోజీలను సరిగా అర్థం చేసుకొని ఉపయోగించాలి తప్ప.. ఎలా పడితే అలా వాడేయకూడదు అని కూడా చెప్పింది. విషయం తప్పుగా కన్వే అయ్యి… సమస్యలు వస్తున్నాయి అనేది రేవతి ఉద్దేశం. మరి ఈ విషయంలో ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఉద్యమాలు చేస్తున్నవాళ్లు ఏమంటారో చూడాలి.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు