Riddhi Kumar: ప్రభాస్ మూవీపై ఆశలు పెట్టుకున్న బ్యూటీ.. ఆశలు నెరవేరతాయా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు  (Prabhas) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ది రాజాసాబ్ (The Rajasaab)  సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమాలో కీలక పాత్రలో నటించిన రిద్ధీ కుమార్ (Riddhi Kumar) ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. రాధేశ్యామ్ మూవీ కమర్షియల్ గా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే.

Riddhi Kumar

అయితే ది రాజాసాబ్ సినిమాలో సైతం రిద్ధీ కుమార్ నటిస్తున్నారు. తెలుగులో రిద్ధీ కుమార్ కొన్ని చిన్నచిన్న సినిమాలలో నటించినా ఆ సినిమాలు కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ది రాజాసాబ్ సినిమాతో తన ఆశలు, కలలు నెరవేరతాయని ఈ బ్యూటీ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ది రాజాసాబ్ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటి. పీపుల్స్ మీడియా బ్యానర్ కు ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రిజల్ట్ విషయంలో షాకిచ్చాయి.

ది రాజాసాబ్ సక్సెస్ తో ఆ నష్టాలు భర్తీ అవుతాయని ఈ సినిమా మేకర్స్ భావిస్తున్నారు. ది రాజాసాబ్ సినిమా దర్శకుడు మారుతికి (Maruthi Dasari) సైతం గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. మారుతి తన కెరీర్ లో ఎప్పుడూ ఈ స్థాయి బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించలేదు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో మారుతి సైతం చేరే ఛాన్స్ అయితే ఉంటుంది.

ప్రభాస్, మారుతి ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ది రాజాసాబ్ సినిమా కథ, కథనం కొత్తగా ఉన్నాయని సమాచారం అందుతోంది. ది రాజాసాబ్ మూవీ ఇతర భాషల్లో సైతం విడుదల కానుంది. హర్రర్ జానర్ ను సైతం ఈ సినిమాలో టచ్ చేస్తుండటం గమనార్హం. ది రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ మారుతి ఏ రేంజ్ హిట్ అందుకుంటారో చూడాలి.

‘మత్తు వదలరా 2’ టీజర్.. ఆ డైలాగ్ హేమపై సెటైరా?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus