Mathu Vadalara 2: ‘మత్తు వదలరా 2’ టీజర్.. ఆ డైలాగ్ హేమపై సెటైరా?!

‘మత్తు వదలరా’  (Mathu Vadalara)  చిత్రానికి చాలా మంది యూత్ ఫ్యాన్స్ అయ్యారు. ఆ సినిమాలో చాలా సన్నివేశాలు సోషల్ మీడియా స్టఫ్ కి దగ్గరగా ఉన్నాయి. అది ఆ టైంలో సినిమాకు ప్లస్ అయ్యింది. దీంతో ‘మత్తు వదలరా 2’ లో కూడా అలాంటి సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ను జోడించే ప్రయత్నం చేసినట్లు ఉన్నాడు దర్శకుడు రితేష్ రానా. ముఖ్యంగా రేవ్ పార్టీ, డ్రగ్స్.. వంటి వాటిల్లో బుక్ అయిన టాలీవుడ్ నటి హేమ (Hema) ఇన్సిడెంట్ ను కూడా ‘మత్తు వదలరా 2’ లో వాడుకున్నట్టు..

Mathu Vadalara 2

తాజాగా బయటకు వచ్చిన టీజర్ ద్వారా స్పష్టమవుతుంది. వివరాల్లోకి వెళితే.. ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) టీజర్లో కమెడియన్ సత్య  (Satya)  ఓ డైలాగ్ చెబుతాడు. ‘డ్రగ్స్ కావాలా? పెద్ద పెద్ద హేమాహేమీలే దొరికిపోయార్రా?’ అంటూ అతను ఓ డైలాగ్ చెబుతాడు. దీని వెనుక దర్శకుడి ఉద్దేశం వేరే ఉంది అన్నది మీడియా ఉద్దేశం. టీజర్ లాంచ్ వేడుకలో నిర్వహించిన ‘క్యూ అండ్ ఎ’ లో భాగంగా దీని గురించి దర్శకుడిని ప్రశ్నించాడు ఓ రిపోర్టర్. ‘సత్యతో ఓ డైలాగ్ చెప్పించారు. ‘హేమా హేమీలు …డ్రగ్స్’ అంటూ ఓ డైలాగ్ సత్య పలికాడు.

అది నటి హేమపై సెటైర్ అనుకోవాలా? ఆమెను ఉద్దేశించి ఈ డైలాగ్ పెట్టారా? ఆమె మీడియా ముందుకు వచ్చి నాకు, డ్రగ్స్ కి సంబంధం లేదు అని చెప్పింది కదా?’ అంటూ నాన్ స్టాప్ గా దర్శకుడిని ప్రశ్నించాడు సదరు రిపోర్టర్. దీనికి దర్శకుడు రితేష్ రానా.. ‘ఆ ఇన్సిడెంట్ కి ముందే మేము ఆ సీన్ షూటింగ్ కంప్లీట్ చేశాం. డబ్బింగ్ కూడా అప్పుడే అయిపోయింది. ఆ డైలాగ్ ఎవ్వరినీ ఉద్దేశించింది కాదు’ అంటూ అతను క్లారిటీ ఇచ్చాడు.

అఖండ సీక్వెల్ రిలీజ్ విషయంలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus