టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా రోజాకు (Roja) ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతోమంది స్టార్ హీరోలకు జోడీగా నటించి రోజా విజయాలను సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా 2014, 2019 ఎన్నికల్లో నగరి వైసీపీ ఎమ్మెల్యేగా గెలవగా 2024 ఎన్నికల్లో మాత్రం ఆమె ఆశించిన ఫలితాలు రాలేదనే సంగతి తెలిసిందే. నగరిలో రోజా కచ్చితంగా ఓడిపోతారని ఫలితాలు వెలువడక ముందే ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ ప్రచారమే నిజమని తేలింది.
సొంత పార్టీ నేతలు సైతం వ్యతిరేకంగా పని చేయడం రోజా పొలిటికల్ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపింది. మంత్రి పదవి వచ్చిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రోజా ఎన్నికల్లో ఓడిపోవడంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీపై ఈ నటి ఫోకస్ పెట్టారని సమాచారం అందుతోంది. మెగా ఫ్యామిలీ , నందమూరి హీరో బాలయ్యపై (Nandamuri Balakrishna) రోజా గతంలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఆ హీరోల సినిమాలలో రోజాకు ఛాన్స్ దక్కకపోవచ్చు.
అందువల్ల రోజా కోలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జబర్దస్త్ షోలో జడ్జిగా రోజా రీఎంట్రీ ఇస్తారనే వార్తలు సైతం ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. వైరల్ అవుతున్న వార్తల గురించి రోజా నుంచి క్లారిటీ వస్తే అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. రోజా పార్టీ మారతారని సైతం సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి.
వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరును సొంతం చేసుకున్న రోజా ఈ మధ్య కాలంలో మీడియాకు మాత్రం దూరంగా ఉన్నారు. రోజా కెరీర్ పరంగా ఎదగాలని విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. సరైన ప్రాజెక్ట్ లతో రీఎంట్రీ ఇస్తే రోజా సినీ కెరీర్ పరంగా బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.