కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘అపరిచితుడు’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. హీరో విక్రమ్ కు తెలుగులో మార్కెట్ ఏర్పడేలా చేసిన చిత్రమిది.ఇప్పటికీ ఈ చిత్రాన్ని బుల్లితెర పై చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. దర్శకుడు శంకర్ టేకింగ్, విక్రమ్ నటన, సదా గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు.
తాజాగా ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది హీరోయిన్ సదా. తాజాగా ఈమె ‘అలీతో సరదాగా’ షోలో పాల్గొని ‘అపరిచితుడు’ రోజులను గుర్తుచేసుకుంది. నిజానికి సినిమా షూటింగ్ టైములో హీరో, హీరోయిన్లు ఫ్రెండ్లీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఏమైనా రొమాంటిక్ సీన్లలో పాల్గొనాలి అంటే.. కనీసం వీళ్ళ మధ్య కొంచెమైనా చనువు ఉండాలి. అయితే ‘అపరిచితుడు’ షూటింగ్ టైములో.. హీరో విక్రమ్ మాత్రం హీరోయిన్ సదాని సిస్టర్ అని పిలిచేవాడట.
సదా కూడా అదేవిధంగా విక్రమ్ తో మసులుకునేదట. ఈ విషయం శంకర్ కు తెలిసి షాక్ అయ్యాడట. మిమ్మల్ని సినిమాలో సీతారాములు లా చూపిస్తుంటే.. ‘మీరు బయట మాత్రం ఇలా బెహేవ్ చేస్తున్నారా? ఈ విషయం మీడియాకి లీకైతే నా సినిమా సంగతేంటి?’ అంటూ ఆయన ఫన్నీగా రియాక్ట్ అయ్యారని సదా చెప్పుకొచ్చింది. సదా కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!