టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధితో పోరాడినటువంటి ఈమె కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి తిరిగి తాను కమిట్ అయిన సినిమాలన్నింటిని పూర్తి చేసి ఇక సినిమాలకు విరామం ప్రకటించారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఎన్నో రకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ వ్యాధి నుంచి బయట పడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా ఇప్పటికే ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నటువంటి సమంత తాజాగా ఓజోన్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ ఓజోన్ థెరపీ ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాకుండా ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు.ఈ ఓజోన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కండరాల కదిలిక ఉంటుందని అలాగే బాడీ పెయిన్స్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.
అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంపొందింప చేస్తుంది అంటూ (Samantha) సమంత ఈ సందర్భంగా ఈ ఓజోన్ థెరపీ ప్రయోజనాలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న పోస్ట్ వైరల్ గా మారాయి. ఇక సమంత ఇప్పటివరకు హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే తాజాగా ఈమె నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఇకపై సమంత ఇండస్ట్రీలో హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగనన్నారు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!