టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్న ఈమె పూర్తిగా తాను కమిట్ అయిన సినిమాలకు దూరంగా ఉంటూ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి సమంత కాస్త కోలుకోవడంతో తిరిగి ఈమె తన సినిమా షూటింగులతో బిజీ కావడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే తన అనారోగ్య సమస్య పూర్తిగా నయం అవ్వాలని కోరుకుంటూ ఈమె పలు గుళ్ళు గోపరాలను దర్శిస్తూ ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే తమిళనాడులో ఉన్నటువంటి పలని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ ఆలయంలో భాగంగా ఈమె కొండ కింద నుంచి పై వరకు మెట్ల మార్గం గుండా వెళ్తూ ప్రత్యేక పూజలు చేశారు.ఈ విధంగా సమంత ప్రతి మెట్టుపై కర్పూర హారతులను వెలిగిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ప్రతి మెట్టుకో కర్పూర హారతులను వెలిగిస్తూ వెళ్లారు. ఇలా కర్పూర హారతులను వెలిగిస్తూ ఈమె తాను తన అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకోవాలని ప్రార్థించినట్టు తెలుస్తుంది. ఈ విధంగా సమంత తన ఆరోగ్యం కోసం పెద్ద ఎత్తున గుళ్ళు గోపురాలు తిరుగుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఈమె గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా పడింది.