“పాప్ కార్న్” అనే మలయాళీ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంయుక్త మీనన్ తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో రానాకి జోడిగా నటించింది. ఈ సినిమాలో రానా భార్యగా నటించిన సంయుక్త మీనన్ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా ధనుష్ హీరోగా నటించిన ‘ సార్ ‘ అనే సినిమాలో ధనుష్ కి జోడిగా నటించింది.
ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన తెలుగు, తమిళ్ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా యూనిట్ ప్రమోషన్ పనులను వేగవంతం చేసింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సంయుక్త ఇటీవల వల్ల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల గురించి సంయుక్త చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఈ ఇంటర్వ్యూలో సంయుక్త మీనన్ ఇంటిపేరు గురించి యాంకర్ ప్రస్తావించగా సంయుక్తా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ..” స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇంటి పేరుతో సహా రాయమన్నారు. అయితే మన పేరు పక్కన ఈ తోక ఏంటా? అని అనుకునేదాన్ని. ఇక పెరిగి పెద్దయ్యాక సినిమా ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు పొందిన తర్వాత నా పేరు పక్కన మీనన్ అనే పేరు ఉండటం సబబు కాదనిపించింది.
ప్రేమ, సమానవత్వం, మానవత్వం కోరుకున్నప్పుడు నాకు నా ఇంటిపేరు అడ్డుస్తోందని అనిపిస్తోంది. అంతే కాకుండా నా తల్లిదండ్రులు కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో నాన్న ఇంటి పేరుని కొనసాగించకూడదని అమ్మ భావించింది. అందువల్ల అమ్మ అభిప్రాయాన్ని గౌరవించాలని భావించి నా పేరు పక్కన ఉన్న ఇంటి పేరుని తొలగించాను. కేవలం మా అమ్మ అభిప్రాయాన్ని గౌరవించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను” అంటూ సంయుక్త మీనన్ చెప్పుకొచ్చింది.