తెలుగులో ఒక సామెత ఉంటుంది..తీసేసినా రాయే..పునాది రాయిగా మారుతాయని అంటారు..అలాంటి సంఘటనే విరూపాపక్ష సినిమా హీరోయిన్ జీవితంలో జరిగింది.. ఏంటో చూద్దాం..టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సంయుక్త మీనన్ తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో కెరీర్ పరంగా దూసుకెళుతున్నారు. విరూపాక్ష సినిమాలో సంయుక్త మీనన్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ పాత్రకు సంబంధించి ఉండే ట్విస్టులు ప్రేక్షకులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేశాయి. సంయుక్త మీనన్ కేరళ అమ్మాయి అయినా తెలుగు చక్కగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే.
ఒకప్పుడు ఈ అందాల తారకు నటన రాదని అందరూ వెక్కిరించారట. దీనిపై ఆమె మాట్లాడుతూ..‘ఒకప్పుడు ఉద్యోగంలో స్థిరపడటమే నా ఏకైక లక్ష్యం. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చా. ఆ తర్వాత సినిమానే నా లోకమైంది. 2016లో నా తొలి మలయాళ చిత్రం ‘పాప్‌కార్న్’ చూసి అందరూ నాకు నటించడం రాదన్నారు. వాస్తవానికి అప్పటికి నాకు సినిమాల గురించి అంతగా తెలియదు. కథ, స్క్రిప్ట్‌పై అవగాహన లేదు.
ఏదో అవకాశం వచ్చింది కదాని క్యాజువల్‌గా నటించేశాను. ఆ చిత్రం తర్వాతే ఇండస్ట్రీ గురించి పూర్తిగా అవగాహన వచ్చింది అన్నారు. అందుకే ఇప్పుడు ఆచీతూచీ అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. నేను ఏ భాషలో చేసినా నా సొంత గొంతునే వినిపించే ప్రయత్నం చేస్తా. ఏ పరిశ్రమలో చేసినా.. ఓ పాత్ర పోషించేటప్పుడు దాన్ని పూర్తిగా సొంతం చేసుకోవాలంటే కచ్చితంగా ఆ భాష తెలిసుండాలి.
అప్పుడే నటిగా (Samyuktha Menon) పూర్తి సంతృప్తి దొరుకుతుంది. టాలీవుడ్లోకి అడుగు పెట్టడానికి ముందే.. ప్రత్యేకంగా శిక్షకుడిని పెట్టుకొని మరీ తెలుగు నేర్చుకున్నా అని చెప్పింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సంయుక్త నువ్వు గ్రేట్ అని పొగుడుతున్నారు.