5 ఏళ్ళ కొడుకున్నాడు.. నా కూతురి బ్రతుకు ఇలా అయిపోతుందనుకోలేదు: సన

టాలీవుడ్ సీనియర్ నటి సన అందరికీ సుపరిచితమే. ఓ పక్క సినిమాల్లో పిన్ని, అత్త వంటి పాత్రలు పోషిస్తూనే మరోపక్క బుల్లితెరపై కూడా సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈమె ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి అంటే ఎవ్వరూ నమ్మరు. అంతలా ఈమె కట్టు బొట్టు ఉంటుంది. అయితే ఆమె తల్లి ముస్లిం.. తండ్రి క్రిస్టియన్. తల్లిదండ్రుల మతాలు వేరైనా ముస్లిం సాంప్రదాయాల్లోనే పుట్టి పెరిగింది. పదో తరగతిలోనే సనాకి వివాహం అయ్యింది.

మొదట ఈమెకు మోడలింగ్ రంగం పై ఆసక్తి ఉండేది కానీ ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించలేదు. అందుకే తన ఇష్టాలకు దూరంగా ఉండేది. అయితే పెళ్లి అయిన ఆమెకు అత్తమామలు అండగా నిలబడ్డారు. ఈమె ఇష్టాలను గౌరవించారు. సినిమాల్లో ఇప్పటికీ రాణిస్తుంది అంటే వారి వల్లే అని ఈమె చాలా సందర్భాల్లో తెలియజేసింది.కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్నే పెళ్ళాడతా’ చిత్రం ద్వారా నటిగా మారిన సన… ‘రంగమార్తాండ’ సినిమాలో కూడా నటించి మెప్పించింది.

ఇటీవల ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కూతురి ఎదుర్కొన్న కొన్ని ప్రమాదకరమైన విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ” నా కూతురికి చిన్న వయసులోనే హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. కానీ తనకు ఆసక్తి లేక వద్దనుకుంది. కాబట్టి పెళ్లి చేసేశాం. తర్వాత ఆమె దుబాయ్ కి అంటే వాళ్ళ అత్తింటికి వెళ్ళింది. అయితే నా కూతుర్ని తన అత్తమామలు దుబాయ్ లో దారుణంగా చిత్రహింసలు పెట్టారు. అన్నం పెట్టకుండా ఏడిపించారు.

తన బంగారం, డబ్బు వాడేసుకున్నారు. నా కూతురు ఇవేవీ కూడా నాకు తెలీనివ్వలేదు. ఒకసారి డౌట్ వచ్చి గట్టిగా అడిగితే ఆమె తన బాధనంతా బయటపెట్టింది. అది విన్న తర్వాత నేను షాక్ లోకి వెళ్లిపోయాను. నా చేతులతో ఎంతోమందికి పెళ్లి చేశాను. కానీ నా కూతురి జీవితం ఇలా ఎందుకు అయిపోయిందా అని కృంగిపోయాను. తర్వాత విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. ఆమెకు 5 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు” అంటూ సన చెప్పుకొచ్చింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus