నటి సనా అందరికీ సుపరిచితమే. ఓ పక్క సినిమాల్లో పిన్ని, అత్త వంటి పాత్రలు పోషిస్తూనే మరోపక్క బుల్లితెరపై కూడా సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఆమె తల్లి ముస్లిం.. తండ్రి క్రిస్టియన్. తల్లిదండ్రుల మతాలు వేరైనా ముస్లిం సాంప్రదాయాల్లోనే పుట్టి పెరిగింది. పదో తరగతిలోనే సనాకి వివాహం అయ్యింది. మొదట ఈమెకు మోడలింగ్ రంగం పై ఆసక్తి ఉండేది కానీ ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించలేదు. అందుకే తన ఇష్టాలకు దూరంగా ఉండేది.
అయితే పెళ్లి అయిన ఆమెకు అత్తమామలు అండగా నిలబడ్డారు. ఈమె ఇష్టాలను గౌరవించారు. సినిమాల్లో ఇప్పటికీ రాణిస్తుంది అంటే వారి వల్లే అని ఈమె చాలా సందర్భాల్లో తెలియజేసింది.కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నిన్నే పెళ్ళాడతా’ చిత్రం ద్వారా నటిగా మారిన ఈమె ‘రంగమార్తాండ’ సినిమాలో కూడా నటించి మెప్పించింది. మొదట్లో ఈమెకు హీరోయిన్ గా కూడా అవకాశాలు వచ్చాయట. కానీ ఎక్స్పోజింగ్ చేయననడంతో హీరోయిన్ ఛాన్స్ లు మిస్ అయ్యాయని చెప్పి షాకిచ్చింది.
సన మాట్లాడుతూ.. “నేను ముస్లిం ఫ్యామిలీలో జన్మించాను. మా ఫ్యామిలీలో అమ్మాయిలు ఈ ఫీల్డ్‌కి వెళ్తామంటే ఒప్పుకోరు. కానీ మోడలింగ్ యాడ్ చూసిన తర్వాత.. మా అత్తయ్య గారిని అడిగాను. ముందు ఒప్పుకోలేదు.. తర్వాత ఆమె వెళ్లి మామయ్యని ఒప్పించారు. ఆ తర్వాత యాడ్ ఏజన్సీకి వెళ్లాను. వెంటనే సెలెక్ట్ అయ్యాను. నా టాలెంట్ ఏంటో మా అత్తమామలు గుర్తించారు. నా ఇష్టాన్ని కాదనలేదు. నేను బురఖా వేసుకోవడం లేదని చుట్టుపక్కల వాళ్లు మా అత్తమామల్ని మాటలనేవారు. ఇవన్నీ భరించారు. నన్ను నిలబెట్టారు.
నేను షూటింగ్‌కి వెళ్తే మా అత్తమ్మ నాతో వచ్చేది. నాకు మొదట్లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. పెళ్లైందని పిల్లలు ఉన్నారని చెప్పొద్దనేవారు. కానీ నేను క్లియర్‌గానే ఉన్నాను. ఏది దాచుకోలేదు. పెళ్లైందని చెప్పడం వల్ల హీరోయిన్‌గా ఛాన్స్ మిస్ అయ్యాయి. అయినా నేనేం బాధపడలేదు. ఇంకా కొన్ని సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేయమన్నారు.. స్విమ్ షూట్ వేయమన్నారు. నేను కుదరదని చెప్పడంతో తీసేశారు.నటిగా నాకు ఏ పాత్ర ఇచ్చినా చేశాను. ‘శ్రీరామరాజ్యం’లో కైకేయిగా నటించాను.. ఆది పరాశక్తి అమ్మవారిగానూ నటించాను” అంటూ చెప్పుకొచ్చింది.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?