Sanghavi: షాకిస్తున్న సీనియర్ హీరోయిన్ సంఘవి లుక్..వీడియో వైరల్!

సీనియర్ హీరోయిన్లు గుర్తుపట్టలేని లుక్స్ తో దర్శనమిచ్చి షాక్ కి గురి చేస్తున్నారు. అలాంటి వారి లిస్ట్ లో ఇప్పుడు సంఘవి కూడా చేరింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా కొన్నాళ్ళు రాణించింది సంఘవి. కర్ణాటకలోని మైసూర్ కు చెందిన ఈమె అసలు పేరు కావ్య . నిజానికి ఈమె డాక్టర్ కావాలనుకుంది కానీ యాక్టర్ అయ్యింది.సంఘవి మంచి డాన్సర్. ఈమె డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్లిన టైంలోనే హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది.

23 సంవత్సరాల పాటు ఈమె హీరోయిన్ గా రాణించింది.చాలా సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రల్లో కూడా నటించింది. ‘ప్రేయసి రావే’ ‘సూర్యవంశం’ ‘గొప్పింటి అల్లుడు’ వంటి సినిమాల్లో ఈమె నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలనే చేసిందని చెప్పాలి. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘తాజ్ మహాల్’ సినిమాతో సంఘవి హీరోయిన్ గా అడుగుపెట్టింది. 1998లో ‘శివయ్య’ సినిమాలో నటిస్తున్న టైంలో ఆ చిత్ర దర్శకుడు సురేష్ వర్మతో ప్రేమలో పడింది.

ఆ తర్వాత అతన్నే పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. అటు తర్వాత బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది. 42 ఏళ్ల వయసులో ఆమె ఓ పాపకు జన్మనివ్వడం జరిగింది. ఇదిలా ఉండగా.. సంఘవి తాజాగా తిరుమలలో దర్శనమిచ్చింది. ఈమెను చూసిన జనాలు షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఈమె చాలా పుష్టిగా కనిపిస్తుంది. ఒకప్పటి సంఘవి లుక్ కి..

ఇప్పటి (Sanghavi) సంఘవి లుక్ కి సంబంధం లేదు అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జిగా చేస్తున్నానని, మంచి పాత్రలు దొరికితే సినిమాల్లో కూడా నటిస్తానని ఈమె చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus