గ్లామర్ షో చేయకుండా తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఒకప్పటి హీరోయిన్ శరణ్య మోహన్ తెలుగులో నాని సరసన ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఆమె నటనని అంత సులువుగా మర్చిపోలేరు. నిజానికి శరణ్య సినిమాల్లోకి రాకముందు క్లాసికల్ డాన్సర్ గా ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఆ సమయంలో మలయాళ దర్శకుడు ఫాజిల్ ఆమెని చూసి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినిమాలో తీసుకున్నారు. ఆ తరువాత మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది.
బాల నటిగా ఎన్నో మలయాళ చిత్రాల్లో నటించిన శరణ్య మోహన్ ఆ తరువాత గ్యాప్ తీసుకొని తన చదువుని పూర్తి చేసుకుంది. ఆ తరువాత తిరిగి సినిమాల్లోకి వచ్చింది. 2005లో శ్రీరామ్ హీరోగా నటించిన ‘ఓరు నల్ల ఓరు కనువు’ అనే సినిమాలో హీరోకి చెల్లెలుగా కనిపించింది. ఆ తరువాత ధనుష్ సినిమాలో కామెడీ పాత్రలో కనిపించి అందరినీ మెప్పించింది. ఈ సినిమా తరువాత శరణ్యకి అవకాశాలు పెరిగాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకి హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. తెలుగులో ‘భీమిలి’, ‘విలేజ్ లో వినాయకుడు’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

2015లో ఈమె తన స్నేహితుడు అరవింద్ కృష్ణన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది శరణ్య. వీరిద్దరికీ ఓ బాబు, పాప ఉన్నారు. బాబు పేరు అనంతపద్మనాభ అరవింద్, కూతురి పేరు అన్నపూర్ణ అరవింద్. రీసెంట్ గా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసింది శరణ్య మోహన్. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నా.. శరణ్య అందం ఎంతమాత్రం తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!
