Actress Sharada: సోషల్‌ మీడియా వార్తలపై శారద ఏమన్నారంటే!

బతికి ఉన్నవాళ్లకు ఎవరైనా ఫోన్‌ చేసి… మీ ఆరోగ్యం గురించి పుకార్లు వస్తున్నాయండి అని అంటే ఎలా ఉంటుంది. చాలా బాధ అనిపిస్తోంది. బతికి ఉండగానే… ఇలా ఎలా అంటారు అనిపిస్తుంది. తాజాగా ఇలాంటి ఇబ్బందే పడ్డారు ప్రముఖ నటి శారద. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శారద… కన్నుమూశారు అంటూ ఆదివారం పుకార్లు షికార్లు చేశాయి. దీంతో వాటిపై శారద మాట్లాడారు.

అలనాటి దిగ్గజ నటి, ఊర్వశి శారద కన్నుమూశారంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. దీంతో నటీనటులతో పాటు, ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆ వార్తలు నిజమా? కాదా? అనే విషయమై ఎవరైనా స్పష్టత ఇస్తే బాగుండు అని ఎదురుచూశారు. ఎవరో ఎందుకు… ఆమెనే నేరగా స్పందించారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను తెలుసుకున్న శారద స్పష్టత ఇచ్చారు.

‘‘నేను బతికే ఉన్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. కాకపోతే ఒంట్లో నలతగా ఉంది. దయచేసి వాట్సాప్‌లలో, ఫేస్‌బుక్‌ల్లో వచ్చే వార్తలు, విషయాలను నమ్మకండి. ఒక వ్యక్తి చేసిన పనికి అందరూ ఆందోళన చెందుతున్నారు. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ వార్తలు నమ్మొద్దు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి వ్యాప్తి చేయడం బాధాకరం’’ అంటూ వాయిస్‌ మెసేజ్‌ ద్వారా అందరూ కుదుటపడేలా చేశారు శారద.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus