Shriya Saran: శ్రియ శరణ్ అల్ట్రా స్టైలిష్ కాస్ట్యూమ్స్ కాస్ట్ ఎంతంటే.!

శ్రియ శరణ్.. 2001లో ‘ఇష్టం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తక్కువ టైంలోనే అగ్రహీరోలతో పాటు యంగ్ స్టార్ హీరోలందరి పక్కన ఆడిపాడింది. అలాగే స్పెషల్ సాంగ్స్‌లోనూ రచ్చ లేపింది. హిందీ, తమిళ్, మలయాళంతో పాటు ఓ ఇంగ్లీష్ సినిమా కూడా చేసింది. అందాల ఆరబోతలోనూ శ్రియ స్టైలే వేరు. తన పరువాలతో కుర్రకారుకి కిక్ ఇస్తుంటుంది. దాదాపు అన్ని భాషల స్టార్స్‌‌తో జతకట్టి, గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఉపేంద్ర ‘కబ్జ’ మూవీతో కన్నడ ఎంట్రీ ఇస్తోంది.

ఈ ముద్దుగుమ్మ తన రష్యన్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చివ్‌ని సీక్రెట్‌గా పెళ్లాడింది. మ్యారేజ్ చేసుకున్న విషయం ఆలస్యంగా చెప్పింది. వీరికి ఓ పాప ఉంది. కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా కానీ ఆడియన్స్ ఆమెను మర్చిపోలేదు. మేకర్స్ కూడా వరుసగా ఆఫర్స్ ఇస్తున్నారు. పిల్ల తల్లి అయినా, వయసు నాలుగు పదులు దాటినా కానీ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు.. యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చేలా ఫిట్‌‌నెస్ మెయింటెన్ చేస్తోంది.

ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్‌తో.. స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో నాజూకుగా వయ్యారాల వడ్డన చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. అవి చూసి ‘నీ గ్లామర్ సీక్రెట్ ఏంటి చెప్పు శ్రియా?’ అని అడుగుతున్నారు నెటిజన్లు. అమ్మడు మాత్రం చిన్న చిరునవ్వి నవ్వి ఊరుకుంటుంది కానీ సీక్రెట్ రివీల్ చేయట్లేదు. ఇటీవల కాలంలో శ్రియ ధరించిన డ్రెస్సెస్ యొక్క బ్రాండ్స్ వాటి తాలుకు కాస్ట్ గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

1) షాహిన్ మన్నన్ – ఓవర్ ద రెయిన్ బో జాకెట్ డ్రెస్ – రూ. 34,000..

2) గౌరి అండ్ నైనిక – ఆఫ్ షోల్డర్ కార్సెట్డ్ మిడి డ్రెస్ – రూ. 44,000..

3) అర్పితా మెహ్తా – రఫుల్ శారీ, ప్లీటెడ్ బ్లౌజ్ & బెల్ట్ సెట్ – రూ. 55,000..

4) పంకజ్ & నిధి – నోల్ హ్యాండ్ – ఎంబ్లిష్డ్ రఫుల్ స్కర్ట్స్ సెట్ – రూ. 39,600..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus