రెమ్యూనరేషన్ లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన స్టార్ హీరోయిన్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగే సెలబ్రిటీలు పెద్ద మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. ఇలా హీరోయిన్స్ ఒకరోజు కాల్ షీట్ కోసం కూడా లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. ఇక షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి వెళ్ళినా కూడా లక్షల్లో రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఒక్కరోజు కోసం లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ సినిమాలలో రెమ్యూనరేషన్ లేకుండా నటించడం అనేది జరగదు కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం హీరో పై ఉన్నటువంటి అభిమానంతో ఏకంగా సినిమాలో రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించారని తెలుస్తుంది.

మరి రెమ్యూనరేషన్ లేకుండా నటించిన ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే.. ఒకానొక సమయంలో నటి శ్రేయ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. అయితే ఈమె అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సినిమాలలో కూడా నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఈమె రెండు సినిమాలలో నటించారు.

ఒకటి బాలు సినిమా ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా వీరిద్దరి పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది అనంతరం పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమాలో శ్రేయ ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ఇక ఈ పాటలో నటించడం కోసం ఈమె ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది.

అప్పట్లో ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈమె పవన్ కళ్యాణ్ కోసం ఒకరోజు మొత్తం తన కాల్ షీట్ ఉపయోగించారని అయితే ఆ పాటలో నటించినందుకు రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. ఇలా రెమ్యూనరేషన్ లేకుండా నటించడం అంటే నిజంగానే గ్రేట్ అంటూ పవన్ ఫ్యాన్స్ (Shriya Saran) ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus