Actress Shriya: ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నేను చూడలేదు.. శ్రీయ షాకింగ్ కామెంట్స్..!

రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రాంచరణ్, ఎన్టీఆర్ లు హీరోలు కావడంతో ఈ మూవీకి మొదటి నుండీ భారీ క్రేజ్ నమోదైంది. సినిమా లేట్ అయ్యే కొద్దీ ఆ అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. సాధారణంగా సినిమా విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ.. ఆ సినిమా పై జనాల్లో క్రేజ్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ రాజమౌళి సినిమాల విషయంలో అలా కాదు, ఆయన సినిమాల విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ జనాల్లో అంతకంతకు ఆసక్తిని పెంచుతూనే ఉంటాయి.

Click Here To Watch NOW

సరే ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ లతో పాటు టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ కూడా ముఖ్య పాత్రలో కనిపించింది. ఆమె అజయ్ దేవగన్ కు జోడీగా సరోజిని అనే పాత్ర పోషించింది. ఓ రకంగా రాంచరణ్ కు తల్లి పాత్ర పోషించిందనే చెప్పాలి. సినిమాలో ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టు ఉంటుంది ఈమె పాత్ర. పెద్దగా ప్రాముఖ్యత అయితే ఉండదు. అందుకేనేమో తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా పై కొన్ని సెటైర్లు వేసింది శ్రీయ.

ఆమె మాట్లాడుతూ.. ” ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా నేను ఇంకా చూడలేదు. ఎందుకంటే నాకు ఇంకా టికెట్లు దొరకలేదు. ప్రతీచోటా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ కి రాజమౌళి దర్శకుడు కాబట్టి.. వెంటనే సైన్ చేసేసా. ఆ టైములో నాకు ఈ చిత్రంలో హీరో ఎవరో తెలీదు. తర్వాత తెలిసింది ఈ చిత్రంలో హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ అని..! ” అంటూ చెప్పుకొచ్చింది. గతంలో శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో ‘ఛత్రపతి’ మూవీ చేసింది. ఇక ఎన్టీఆర్ తో కలిసి ‘నా అల్లుడు’ అనే చిత్రంలో నటించింది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus