Shruti Haasan: మానసిక సమస్యకు చికిత్స తీసుకుంటున్నాను… సమస్యపై ఓపెన్ అయిన శృతి!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి శృతిహాసన్ ఒకరు. ఈమె తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తే ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈమె నటించిన వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇక రేపు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా విడుదల కానుంది. వీటితోపాటు మరికొన్ని సినిమాలలో కూడా శృతిహాసన్ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తాను ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యల గురించి కూడా బయటపెట్టారు. ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ తాను గత కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నానని తెలిపారు. అయితే తన మానసిక పరిస్థితి కోసం ఈమె ఇప్పటికే చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

నేను బాధపడుతున్నటువంటి ఈ మానసిక సమస్య కారణంగా ఉన్నట్టుండి ఎక్కువగా ఆవేశపడటమే కాకుండా చాలా తొందరగా సహనం కోల్పోతున్నానని తెలిపారు.మొదట్లో నేను నా సమస్య గురించి బయటకు చెప్పడానికి భయపడేదాన్ని అయితే ఈ సమస్యను దాచుకోవటం వల్ల మరింత పెరిగే అవకాశం ఉందని తాను తన సమస్యను దాచుకోకుండా బయటకు చెబుతున్నానని తెలిపారు. అయితే ఈ సమస్య తనకు అధికమైనప్పుడు ఈ బాధ నుంచి బయటపడటానికి సంగీతం వింటానని తెలిపారు.

ఇక తాను అనుకున్నది అనుకున్న విధంగా జరగకపోతే ఇంట్లో అయిన షూటింగ్స్ లో అయినా కూడా తనకు వెంటనే కోపం వస్తుందని, ఈ పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉండడం కోసం తెరపి చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా శృతిహాసన్ తన బాధపడుతున్న వ్యాధి గురించి తెలియజేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus