Actress Sneha: స్నేహ తండ్రి భీమ రథ శాంతి సెలెబ్రేషన్స్ ఫోటోలు వైరల్..!

సుహాసిని రాజారాం నాయుడు.. ఇలా చెబితే ఎవ్వరికీ అర్థం కాదేమో అదే స్నేహ అనగానే టక్కున ‘సంక్రాంతి’ ‘రాధా గోపాలం’ వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. 2001 వ సంవత్సరంలో తరుణ్ హీరోగా వచ్చిన ‘ప్రియమైన నీకు’ చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అటు తర్వాత ‘హనుమాన్ జంక్షన్’ ‘వెంకీ’ ‘సంక్రాంతి’ ‘రాధా గోపాలం’ ‘శ్రీరామదాసు’ ‘మధుమాసం’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్లో మరో సౌందర్యలా చక్రం తిప్పుతుంది అనుకుంటే ఈమె తొందరగానే ఫేడౌట్ అయిపోయింది.

కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది ఈ అమ్మడు. ఇక చూడడానికి ఎంతో చక్కగా తెలుగుతనం ఉట్టిపడేలా కనిపించే స్నేహ ..తమిళ నటుడు ప్రసన్నను 2011 లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇటీవల స్నేహ తండ్రి తన 70 వ పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. దీనిని భీమ రథ శాంతి అని అంటుంటారట.

స్నేహ కుటుంబ సభ్యులంతా కలిసి ఈ వేడుకను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో స్నేహ ఫ్యామిలీ చాలా ట్రెడిషనల్ గా అదే విధంగా చూడముచ్చటగా ఉందని చెప్పొచ్చు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు సూపర్,బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus