సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోత అనేది కొత్త టాపిక్ ఏమీ కాదు.కాకపోతే అవకాశాలు తగ్గుతున్నాయి లేదా అవకాశాలు ఇంకా పెంచుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడే వాళ్ళు గ్లామర్ డోస్ పెంచుతున్నారు. అదీ కాక హీరోయిన్లు మాత్రమే కాకుండా.. సీనియర్ నటీమణులు, సీరియల్స్ నటీమణులు, యాంకర్లు కూడా గ్లామర్ షో చేయడం అలవాటు చేసుకున్నారు. ఓ రకంగా హీరోయిన్ల ఫోటోలు కంటే కూడా వీళ్ళ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి అని చెప్పాలి.
వీటి వల్ల అయితే అవకాశాలు పెరుగుతాయి లేదు అంటే వస్తాయి.. అదీ కాకపోతే బ్రాండ్ ప్రమోషన్స్ కోసం అయినా వీళ్ళని అప్రోచ్ అవుతారు, డబ్బులు ఇస్తారు. అది మేటర్. తెలుగు వాళ్ళు మాత్రమే కాదు.. అన్ని భాషల్లో ఉన్న నటీమణులు ఫాలో అయ్యేది ఇదే పద్ధతి. రోజూ ఎవరొకరి ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతాయి. ఈరోజు బెంగాలీ నటి సోహిని సర్కార్ ఫోటోలు చర్చనీయాంశం అయ్యాయి.
అక్కడ స్మాల్ స్క్రీన్ లో సందడి చేస్తూ సోషల్ మీడియాలో ఈమె గట్టిగానే ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. 2013లో ‘రూప్ కథ నోయ్’ మూవీతో బిగ్ స్క్రీన్ పై కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘షోరింగ్’, ‘టీ బయోస్కోప్ తెరవండి’, ‘ఝుమురా’, ‘మణిహార’, ‘రాజకహిణి’, ‘హర్ హర్ బ్యోమకేష్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
‘కాబూలీవాలా’ చిత్రంతో గత ఏడాది ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ‘అథోయ్’ వంటి సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో సోహిని సర్కార్ (Sohini Sarkar) బ్లౌజ్ లేకుండా మెడలో మల్లెపూల దండ వేసుకుని యమ హాట్ ఫోజులు ఇచ్చింది.