Sonal Chauhan: అమ్మడికి సినిమాలే లేవు..కారు ఎలా కొన్నది అంటున్న నెటిజన్లు..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు వరుస పెట్టి ఖరీదైన కార్లు కొంటున్నారు. హీరోల కంటే మేమేం తక్కువ కాదంటూ హీరోయిన్లు కూడా కోట్లు కుమ్మరించి మరీ లగ్జరీ కార్లు సొంతం చేసుకుంటున్నారు. ఇది చూస్తే ఈ విజయ దశమికి అందాల భామలు అందరూ కలిసి కార్లు కొనాలని టార్గెట్ ఏమైనా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒకరి తర్వాత మరొకరు వరుస పెట్టి కొత్త కార్లను కొని తమ ఇళ్లకు తెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు ఆ జాబితాలో బాలయ్య భామ సోనాల్ చౌహాన్ చేరిపోయింది. దసరాకు సోనాల్ చౌహాన్ కూడా కొత్త లగ్జరీ కారు కొన్నారు. తాను మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేశారు. సోనాల్ కొన్న ఈ కారు ఖరీదు రూ. 90 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అయితే.. ఇటీవలే రూ. 4 కోట్లు పెట్టి లంబోర్ఘిని కారును శ్రద్ధా కపూర్, మూడు కోట్లు పెట్టి రేంజ్ రోవర్ కారును పూజా హెగ్డే కొనుగోలు చేశారు.

సోనాల్ చౌహాన్ ‘జన్నత్’ సినిమాతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో ఇమ్రాన్ హష్మీ సరసన నటించారు. ఆ తర్వాత ‘రెయిన్ బో’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. అయితే… నట సింహం నందమూరి బాలకృష్ణతో నటించిన ‘లెజెండ్’, ‘డిక్టేటర్’, ‘రూలర్’ సినిమాలు ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో పాపులారిటీ తెచ్చి పెట్టాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘ఎఫ్ 3’లో కూడా సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) గెస్ట్ రోల్ చేశారు. ఆ తర్వాత నాగార్జున ‘ఘోస్ట్’ సినిమాలో నటించారు.

యాక్టింగ్ కంటే తన గ్లామర్ తోనే ఎక్కువగా హైలట్ అవుతున్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో మండోదరి పాత్రలో మెరిశారు. త్వరలోనే ‘దర్ద్’ సినిమాతో మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అమ్మడు సినిమాలతో సంబంధం లేకుండా గ్లామర్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సెగల పుట్టిస్తారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus