Soundarya Mother: నీకెందుకు మమ్మీ నేనున్నాను కదా అంటుంది.. కానీ!

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటి సౌందర్య ఒకరు.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఈమె అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఏమాత్రం గ్లామర్ షో లేకుండా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగారు. ఇండస్ట్రీలో ఎంతో మంచి లైఫ్ ఉన్నప్పటికీ అతి చిన్న వయసులోనే ఈమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సౌందర్య తనతో పాటు తన సోదరుడు అమర్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇలా సౌందర్య చనిపోయి దాదాపు రెండు దశాబ్దాలు అయితున్న ఇంకా ఈమె మరణ వార్త ప్రేక్షకులు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పాలి. సౌందర్య మరణం ఇండస్ట్రీకి తీరని లోటు గానే మిగిలిపోయింది.ఇండస్ట్రీలో సుమారు 100 సినిమాలలో నటించిన సౌందర్య ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారనే చెప్పాలి.

ఇలా సౌందర్య మరణించి ఎన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ తన కూతురు తన కలలోకి వస్తుందని సౌందర్య తల్లి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సౌందర్య గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సౌందర్య తల్లి తన ఇద్దరు పిల్లలను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. తాను ఎప్పుడైనా బాధగా ఉన్న నా మనసు బాగా లేకపోయినా ఆ రోజు తన ఇద్దరు పిల్లలు తన కలలో కనిపిస్తారని సౌందర్య తల్లి తెలియచేశారు.

నేను బాధగా ఉంటే సౌందర్య (Soundarya )నీకెందుకు మమ్మీ నేనున్నాను కదా అంటుంది కానీ ఆ కల మాత్రం మధ్యలోనే ఆగిపోతుంది.ఇలా ఎందుకు జరుగుతుందో తనకు అర్థం కావడం లేదంటూ ఈ సందర్భంగా సౌందర్య తల్లి సౌందర్యను తలుచుకొని ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus