దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.అతి చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా సక్సెస్ సాధించిన సౌందర్య అంతే తొందరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సౌందర్య 2004వ సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి మనకు తెలిసిందే.
అయితే సౌందర్య మరణం ఇప్పటికీ అభిమానులకు తీరని లోటు అని చెప్పాలి. సౌందర్య మరణించినప్పటికీ ఆమె చేసిన సామాజిక సేవ కార్యక్రమాల రూపంలో ఇప్పటికే ఆమె అలాగే బ్రతికి ఉందని చెప్పాలి. సౌందర్య హీరోయిన్గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సమయంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. మానసిక ఎదుగుదల లేని పిల్లల కోసం సౌందర్య ప్రత్యేకంగా పాఠశాలలను కూడా ఏర్పాటు చేశారు.
ఇలా ఈమె చేసిన సామాజిక సేవ కార్యక్రమాల రూపంలో సౌందర్య ఇంకా బ్రతికే ఉన్నారని చెప్పాలి. ఇకపోతే జులై 17వ తేదీ సౌందర్య పుట్టినరోజు కావడంతో అభిమానులు మరోసారి ఆమెను గుర్తు చేసుకున్నారు. అయితే ఇలా ఎన్నో కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నటువంటి ఈమె చివరి కోరిక తీరకుండానే చనిపోయారట.
అప్పటికే బిజెపి పార్టీలోకి చేరినటువంటి ఈమెకు కాటన్ చీరలు లేకపోవడంతో తన వదినకు కాటన్ చీర కుంకుమ తీసుకు రమ్మని చెప్పారట అవి తీసుకు వచ్చేలోపే ఈమె ప్రచారం కోసం వెళ్లిపోవడం ప్రమాదంలో మరణించడం జరిగిందని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా (Soundarya) సౌందర్య వదిన తన చివరి కోరిక గురించి తెలిపారు.