నటి శ్రీ లీలా తల్లి పై పోలీసులకు ఫిర్యాదు.. ఏం జరిగిందంటే?

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయారు నటి శ్రీ లీల.పెళ్లి సందడి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ నటనకు ప్రేక్షకులు ఫిదా కావడంతో ప్రస్తుతం ఈమె వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు అరడజనుకు పైగా సినిమా అవకాశాలను చేతిలో పెట్టుకున్నటువంటి శ్రీ లీల వరుస షూటింగ్ లతో బిజీగా గడుపుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె తల్లి స్వర్ణలత ఓ వివాదంలో చిక్కుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటి అనే విషయానికి వస్తే నటి శ్రీ లీల తండ్రి శుభకర్ రావు ఆమె తల్లి స్వర్ణలతపై కర్ణాటకలోని అడుగుడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత 20 సంవత్సరాల నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే.

ఇకపోతే తన తల్లి దగ్గరే శ్రీ లీల ఉంటున్నారు. అయితే ఇప్పటికి వీరి విడాకుల కేసు ఇంకా కోర్టులో పెండింగానే మిగిలిపోయింది. తాజాగా శుభకర్ రావు ఈమెపై పోలీస్ కేసు పెట్టారు. అక్టోబర్ 3న బెంగళూరులో కోరమంగళలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లోకి ఎటువంటి అనుమతి లేకుండా స్వర్ణలత ఎంట్రీ ఇచ్చింది. అపార్ట్మెంట్ డోర్ లాక్ పగలగొట్టి మరి ఇంట్లోకి వచ్చిందని శుభకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విధంగా స్వర్ణలత అక్రమంగా తన అనుమతి లేకుండా తన అపార్ట్మెంట్లోకి రావడంతో ఈయన పోలీసులకు ఫిర్యాదు చేయక పోలీసులు ఈ విషయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే ఈ విషయంపై స్వర్ణలత ఇప్పటివరకు ఏమాత్రం స్పందించలేదు. ఇకపోతే గతంలో ఓసారి శ్రీ లీల తన కూతురు కాదంటూ శుభకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus