Actress: నన్ను చూడగానే చిరంజీవి ఎమోషనల్ అయ్యారు!

చిరంజీవి – సుజిత అనగానే అందరికీ ‘పసివాడి ప్రాణం’ సినిమా గుర్తొస్తుంది. 1987 జూలై 23 న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ రోజుల్లోనే ఈ సినిమా రూ.4.5 కోట్లు వసూల్ చేసి ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ‘గీతా ఆర్ట్స్’ సంస్థ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా అంత పెద్ద సక్సెస్ సాధిస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు.

ఈ చిత్రంలో చిరంజీవి.. ప్రేమించిన అమ్మాయిని కోల్పోవడంతో డిప్రెషన్ కి వెళ్ళిపోయి ఓ తాగుబోతుగా మారిపోతారు. అలాంటి వ్యక్తికి ఓ పసివాడు దొరుకుతాడు. అయితే ఆ పసివాడిని చంపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. ఇదిలా ఉండగా .. ఈ చిత్రంలో సుజిత పసివాడి పాత్రని పోషించింది. ఈమె దర్శకుడు, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ సోదరి అనే సంగతి ఎక్కువమందికి తెలిసి ఉండదు.

ఆ తర్వాత ఈమె ‘జై చిరంజీవ’ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రని పోషించింది. ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు ఆమె చిరంజీవిని చూడగానే ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుందట. చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవిని చూడటంతో ఆమెకు కన్నీళ్లు ఆగలేదట. అయితే చిరంజీవి కూడా ఆమెను చూసి ఎమోషనల్ అయిపోయినట్టు తెలుస్తుంది. ‘జై చిరంజీవ’ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు బాగా రావడానికి కారణం అదే అన్నట్టు ఆమె (Actress) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus